ఎఫ్ 3 (F3) సినిమా ప్రమోషన్ : హీరో వరుణ్ తేజ్ ఎంట్రీ

Published on May 11, 2022 11:47 AM IST

ఎఫ్ 3 సినిమాలోనూ వెంకీ, వరుణ్‌లు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ‘వాళ్లది మరాఠీ ఫ్యామిలీ అయితే మాది దగ్గుబాటి ఫ్యామిలీ’’, ‘‘వాళ్లది దగా ఫ్యామిలీ అయితే మాది మెగా ఫ్యామిలీ’’ అంటూ మరింతగా నవ్వించనున్నారు ఈ తోడల్లుళ్లు.

ఈ సినిమాలో వీరిద్దరికి తోడుగా రాజేంద్రప్రసాద్, సునీల్​ కామెడీ కూడా తోడవడం మరిన్ని నవ్వులు పూయించేలా ఉంది.ఇంతకు ముందు విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. మొదటి భాగాన్ని మించిన వినోదం రెండో భాగంలో ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ సినిమా కథంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. ఉన్నోడికి ఫన్.. లేనోడికి ఫ్రస్ట్రేషన్ అని వెరైటీ డైలాగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్‌లో నటుడు వరుణ్ తేజ్ సందడి చేశారు. కాసేపు తన అభిమానులతో ముచ్చటించారు.