సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) : మహేష్ గురించి సుధీర్ బాబు మాటల్లో..

Published on May 11, 2022 03:15 PM IST

సుధీర్ బాబు (Sudheer Babu).. తెలుగు సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు బావగా ఈయన సుపరిచితుడు. ఎస్సెమ్మెస్, క్రిష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, వీరభోగవసంత రాయలు, భలే మంచి రోజు, ప్రేమకథా చిత్రం, శమంతకమణి, శ్రీదేవి సోడా సెంటర్ లాంటి సినిమాలు ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. 

ఇటీవలే సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుధీర్ బాబు మాట్లాడారు. మహేష్ బాబు గురించి తన మనసులోని మాటలను బయటపెట్టారు "చాలామంది సినీ అభిమానులు వింటేజ్ మహేష్ ఈజ్ బ్యాక్ అంటారు. కానీ అలాంటిది ఏమీ లేదు. అతడు అన్ని పాత్రలు చేయగలడు. ముఖ్యంగా వైవిధ్యమైన సబ్జెక్టులు ఎంచుకుంటాడు. అందుకే వింటేజ్ అనే పదాన్ని నేను ఇక్కడ ఒప్పుకోను. 

అలాగే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా అనే పదాన్ని ఎక్కువగా సినీ పరిశ్రమలో వాడుతున్నారు. కానీ మహేష్ విషయానికి వస్తే, ఆ పదం చెల్లదు. అతనికి వర్తించే పదాన్ని నేను పాన్ ఆడియన్స్ అంటాను.ఒక కూలీ దగ్గర నుండీ ఐటి ఎంప్లాయ్, ఇంటర్ కుర్రాడు, లేడీస్, ముసలివాళ్లు.. ఇలా అందరికీ దగ్గరైన హీరో మహేష్ బాబు ఒక్కడే. అతడికి క్లాస్, మాస్ అనే తేడా లేదు. అతను క్లాస్ చేస్తే మనం క్లాస్ ఆడియన్స్.. మాస్ సినిమా చేస్తే మనం మాస్ ఆడియన్స్.. అంతే" అని తన మనసులోని మాటను బయటపెట్టారు సుధీర్ బాబు. 

"హైపర్ యాక్టివ్, సీరియస్, కామెడీ.. ఇలా ఏ పాత్రనైనా చేయగలరు మహేష్.అండ్ ఎవ్రీతింగ్ ఈజ్ వింటేజ్ అబౌట్ హిమ్" అని అభిమానులకు తెలిపారు సుధీర్ బాబు.