Sai Dharam Tej : సాయితేజ్, సంపత్ నంది కాంబినేషన్‌లో.. ఓ భారీ యాక్షన్ సినిమాకు ప్లాన్ రెడీ !

సాయితేజ్‌‌తో  (Sai Dharam Tej) కూడా సంపత్ నంది ఓ సినిమా చేస్తున్నారనే న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్.. మెగా ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికి కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్న హీరో. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, చిత్రలహరి, ప్రతి రోజు పండగే, సోలో బతుకే సో బెటర్, రిపబ్లిక్ లాంటి చిత్రాలు సాయి ధరమ్ తేజ్‌కు ఎంతో పేరు తీసుకొచ్చాయి. తర్వాత ఇదే హీరో, తన పేరును సాయి తేజ్‌గా మార్చుకున్నాడు. 

ఇటీవలే ఓ బైక్ యాక్సిడెంట్‌లో గాయపడ్డ సాయి తేజ్ తర్వాత కోలుకున్నాడు. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తున్నాడు. దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్‌లో రూపొందే ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాలో సాయి తేజ్ (Sai Dharam Tej) నటించనున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందట. 

సంపత్ నంది గతంలో బెంగాల్ టైగర్, ఏమైంది ఈ వేళ, రచ్చ, గౌతమ్ నందా, సిటీమార్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే ఒదేలా రైల్వేస్టేషన్, బ్లాక్ రోజ్ సినిమాలకు కథలను అందిస్తున్నారు. విక్రమార్కుడు 2 సినిమాకు దర్శకత్వం వహించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. 

ఇదే క్రమంలో ఈ రోజు సాయితేజ్‌‌తో  (Sai Dharam Tej) కూడా సంపత్ నంది ఓ సినిమా చేస్తున్నారనే న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. అన్నీ సరిగ్గా కుదిరితే, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉంది. 

ఇక సాయితేజ్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన కార్తిక్ అనే ఓ నూతన దర్శకుడితో  సినిమాకి సైన్ చేశారు. అలాగే మరికొన్ని ప్రాజెక్టులు ఒప్పుకున్నట్లు కూడా సమాచారం. ఏదేమైనా, సంపత్ నందితో సాయితేజ్ చేసే సినిమాపై ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొని ఉంది. 

Read More:  Pawan Kalyan: త‌న దేవుడు ప‌వ‌న్ మామ అంటున్న సాయిధ‌ర‌మ్ తేజ్‌!

Credits: Instagram
You May Also Like These