Ravi Teja: ఓటీటీలోకి 'రామారావు అన్ డ్యూటీ' (Ramarao On Duty)!... స్ట్రీమింగ్ ఎప్ప‌టినుంచి?

ర‌వితేజ (Ravi Teja) న‌టించిన'రామారావు ఆన్‌ డ్యూటీ' చిత్రం ఓటీటీలో విడుద‌ల కానుంది.  ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీలివ్‌లో ప్రసారం కానుంది.

Ramarao On Duty: టాలీవుడ్ మాస్ మ‌హారాజ ర‌వితేజ (Ravi Teja) న‌టించిన యాక్ష‌న్ సినిమా 'రామారావు ఆన్‌ డ్యూటీ'.ఈ సినిమా జూలై 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 'రామారావు ఆన్‌ డ్యూటీ' చిత్రం ఓటీటీలో విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీలివ్‌లో ప్రసారం కానుంది. వ‌చ్చే నెల స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధ‌మైంది. ఈ సినిమా ర‌వితేజ‌కు డిజాస్ట‌ర్‌గా మిగిలింది.

నాలుగు భాష‌ల్లో స్ట్రీమింగ్

హీరో ర‌వితేజ 68వ సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ' (Ramarao On Duty). మాస్ యాక్ష‌న్ సినిమాగా 'రామారావు ఆన్ డ్యూటీ' విడులైంది. ఈ సినిమాతో .హీరో వేణు రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు యంగ్‌ డైరెక్టర్‌ శరత్‌ మండవ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు.

'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్‌లో సెప్టెంబ‌ర్ 15 నుంచి ప్ర‌సారం కానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్న‌డ‌, మలయాళ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుంది. 

ర‌వితేజకు హిట్ ఇవ్వ‌ని సినిమా

'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించారు. హీరో వేణు పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించారు. ఈ చిత్రంలో  రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్ గా నటించారు.ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, సర్పట్ట జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ న‌టించారు. 

‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి హిట్ సాధిస్తుందో చూడాలి. ప్ర‌స్తుతం ర‌వితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియ లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. 

Read More: Ramarao On Duty Review : మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) జనాలను మెప్పించాడా ? లేదా ?

Credits: Twitter
You May Also Like These