టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ మహారాజు రవితేజ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాలో రవితేజ ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఆయన ఫస్ట్ లుక్ టీజర్ ను ఇటీవల విడుదల చేయగా.. సోషల్ మీడియా లో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. కాగా, ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచుతోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘బాస్ పార్టీ’ (Boss Party) సాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. అయితే, తాజాగా ఈ మూవీలోని సెకండ్ సింగల్ బీట్‌ని ఇటీవల చిరంజీవి లీక్ చేయగా, నేడు మేకర్స్ ఫుల్ సాంగ్ విడుదల చేశారు. “నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి” (Sridevi Chiranjeevi Song) అంటూ సాగే ఈ పాటలో చిరంజీవి, శృతిహాసన్ (Shruti Haasan) అదరగొట్టారు.
జాస్ ప్రీత్ జాజ్, సమీరా భరద్వాజ్ అద్భుతంగా పాడిన మెలోడియస్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు మేకర్స్. ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చడం విశేషం. ముఖ్యంగా ఈ సాంగ్ అటు యువతతో పాటు మాస్ ఆడియన్స్ సైతం ఎంతో ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి స్పందనతో దూసుకుపోతోంది.
ఇక, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులకి చిరంజీవి (Megastar Chiranjeevi) గ్రేస్ యాడ్ చేసి అదరగొట్టేశాడు. ఫ్రాన్స్ లోని అందమైన లొకేషన్స్‌లో.. సినిమాటోగ్రాఫర్ ఆర్థర్ ఏ విల్సన్ చాలా చక్కగా చిత్రీకరించాడు. చిరంజీవి కూడా హీరోయిన్ శృతిహాసన్ పక్కన చాలా యంగ్ గా కనపడ్డాడు. దీంతో ఈ పాట కూడా ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) లిస్టులో మరో బ్లాక్ బస్టర్ కాబోతుందనడంలో సందేహం లేదు.
Follow Us