పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) .. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పవన్.. అనతి కాలంలోనే పవర్ స్టార్‌గా అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
తర్వాత సుస్వాగతం, బద్రి, తొలిప్రేమ, తమ్ముడు, జల్సా, అత్తారింటికి దారేదీ, వకీల్ సాబ్ లాంటి సినిమాలతో ఒక స్టార్ డమ్‌ని సొంతం చేసుకున్నారు.
పవర్ స్టార్‌కు అభిమానులెందరో
ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా తనదైన శైలిలో పావులు కదుపుతూ, జనసేనానిగా అభిమానుల ఆదరణను పొందుతున్నారు. పవన్ కళ్యాణ్‌కు ఇండస్ట్రీలో ఎందరో స్నేహితులున్నారు.
ఆలీ, హరీష్ శంకర్ మొదలైన వారు పవన్ స్నేహితుల జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" చిత్రంలో నటిస్తున్నారు.
పవన్ తను నటించిన కొన్ని సినిమాలకు స్టంట్ కొరియోగ్రఫర్‌గానూ వ్యవహరించారు. అలాగే "జానీ" అనే సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించారు. అలాగే తాను నటించిన పలు సినిమాలలో పాటలు కూడా పాడారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). "గుడుంబా శంకర్" సినిమాలోని పాటలకు తానే డ్యాన్స్ డైరెక్టరుగానూ వ్యవహరించారు.
నెట్టింట్లో దుమ్ము రేపుతున్న సీడీపీ
సెప్టెంబర్ 2.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన జన్మదిన వేడుకలను పురస్కరించుకొని, తాజాగా సోషల్ మీడియాలో పవర్ స్టార్ అభిమానులు ఆయన సీడీపీ (కామన్ డిస్ల్పే పిక్చర్) ని విడుదల చేశారు.
"మనల్ని ఎవడ్రా ఆపేది" అనే నినాదంతో రూపొందించిన ఆ సీడీపీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని 2014 సంవత్సరంలో స్థాపించారు. ఈ పార్టీకి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. 2014 ఎన్నికలలో ఈ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం జనసేనకు విద్యార్థి, యువజన, మహిళా విభాగాలు ఉన్నాయి. భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ పేరిట జనసేన విద్యార్థి విభాగం నడుస్తోంది.
Read More : ఇండస్ట్రీ స్టామినాను పెంచిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టాప్ సినిమాలు.. మీకోసం ప్రత్యేకం
Follow Us