Ante Sundaraniki:టాలీవుడ్ హీరో నాని వైవిధ్యమైన కథలను ఎప్పుడూ ఎంచుకుంటూ ఉంటారు. ఆయన సినిమాలలోని సబ్జెక్టులన్నీ చాలా వినూత్నంగా ఉంటాయి. వాటితోనే నాని ప్రేక్షకులకు వినోదం పంచుతారు.
ప్రస్తుతం 'అంటే సుందరానికీ' ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన 'అంటే.. సుందరానికి' సినిమా కొన్ని గంటల్లో విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. 'అంటే.. సుందరానికీ' మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.
రెండు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటే .. వారికి ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయనే కథతో 'అంటే సుందరానికి' తెరకెక్కించారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సుందరం (Nani), క్రిస్టియన్ అమ్మాయి లీలా ధామస్ (నజ్రియా )ను ప్రేమిస్తాడు.
వైవిధ్యమైన పాత్రలో నాని !
ఇద్దరి మతాలు ఒకటి కాకపోవడంతో, ఇంట్లో వాళ్లకు ఆ అమ్మాయి బ్రాహ్మిణ్ అని చెబుతాడు సుందరం. ఈ జంటకు ఎదురయ్యే సమస్యలను చాలా ఫన్నీగా తెరకెక్కించారు వివేక్ ఆత్రేయ. లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'అంటే.. సుందరానికీ' (Ante Sundaraniki) రిలీజ్ కానుంది.
అంటే..సుందరానికీ సినిమాపై భారీ అంచనాలు
అంటే సుందరానికీ (Ante Sundaraniki) సినిమా ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకునేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే, సోషల్ మీడియాలో వరుస అప్‌డేట్స్ ఇస్తోంది. 'అంటే.. సుందరానికీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 9 న సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఈ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పవన్ కల్యాణ్ వస్తున్నారని తెలియడంతో 'నాని' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు.. పవర్ స్టార్ అభిమానులు క్యూ కట్టారు.
అంటే.. సుందరానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..
- నైజాం - రూ. 10 కోట్లు
- సీడెడ్- రూ. 4 కోట్లు
- ఏపీ - రూ. 10 కోట్లు
- ఏపీ, తెలంగాణ - రూ. 24 కోట్లు
- ఇతర రాష్ట్రాల్లో - రూ. 2.50 కోట్లు
- విదేశాల్లో - రూ. 3.50 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా 'అంటే సుందరానికీ' విడుదలకు ముందే రూ.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే, మరో రూ. 31 కోట్లు రాబట్టాలి.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్లో రిలీజ్ కానుందంటే..
నైజాంలో 210 థియేటర్స్‌లో 'అంటే సుందరానికీ' చిత్రం విడుదల కానుంది. రాయలసీమలో 90, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 250 కు పైగా థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో 550 థియేటర్లలో రిలీజ్ కానుంది. మిగతా రాష్ట్రాల్లో 150 స్కీన్లలో విడుదల కానుంది.
అలాగే, ఓవర్సీస్‌లో 400 స్కీన్లలో 'అంటే.. సుందరానికీ' రిలీజ్ కానుంది. తెలుగు, తమిళంద, మలయాళం భాషల్లో కలిపి 1100 స్కీన్లలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Follow Us