Sarkaru Vaari Paata (సర్కారు వారి పాట) : ఫ్యాన్స్ గురించి మహేష్ మనసులోని మాట

Published on May 11, 2022 02:23 PM IST

సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata).. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే టాక్ నడుస్తోంది. అసలే మహేష్ బాబు సినిమా. అంతకుమించి ఒక సరికొత్త సబ్జెక్టుతో ప్రేక్షకుల నాడిని పరీక్షించడానికి బరిలోకి దిగుతున్న చిత్రం ఇది.  అందుకే అభిమానులకు ఇదే చిత్రంపై ఎక్స్‌పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. ఇటీవలే జరిగిన ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో మహేష్ బాబు ఇదే విషయాన్ని ప్రస్తావించారు.  

ఫ్యాన్స్.. అనే పదం గురించి ఈ ప్రమోషనల్ ఈవెంట్‌లో మహేష్ ప్రత్యేకంగా మాట్లాడారు. తానెప్పుడూ అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేయనని, ఏ సినిమా చేసినా, వారిని దృష్టిలో పెట్టుకొనే చేస్తానన్నారు. పరుశురామ్ ఈ సినిమాకు ఓ తిరుగలేని కథను అందించారని, ఆ కథ మీద నమ్మకంతోటే తాను సినిమాకి సైన్ చేశానని తెలిపారు మహేష్.

ఈ సందర్భంగా మహేష్‌తో కలిసి ఓ ఫోటో దిగాలని ఉందని, నటి కీర్తి సురేష్ చెప్పడంతో ప్రోగ్రామ్‌లో నవ్వులు విరబూశాయి. హీరోయినే ఆ మాట అడగడంతో, అందరూ ఆశ్చర్యపోయారు. ఈ చిత్రంలో కళావతి అనే పాత్రలో నటి కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఆ పాత్ర పై ప్రత్యేకంగా వ్రాసిన గీతం కూడా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.