టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప సినిమా తరువాత పాన్ ఇండియా హీరోగా మారారు. పుష్ప 2 షూటింగ్ కోసం అల్లు అర్జున్ సిద్ధమవుతున్నారు. మరోవైపు పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ అల్లు అర్జున్ ఫుల్ బిజీగా మారారు. వాణిజ్య ప్రకటనల్లో అల్లు అర్జున్ లుక్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. రీసెంట్గా కోకాకోలా యాడ్‌లో అల్లు అర్జున్ అదరగొట్టారు. కొరియన్ అమ్మాయిలతో చేసిన డాన్సులు వైరల్‌గా మారాయి.
స్టైలిష్‌గా మారిన ఐకాన్ స్టార్
ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) కొరియన్ అమ్మాయిలతో కలిసి కోకా కోలా యాడ్‌లో నటించారు. బన్ని డాన్సులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అల్లు అర్జున్ స్టైల్, కాస్టూమ్స్ కొత్తగా కనిపించాయి. బన్ని దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ యాడ్ ఫిలిమ్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అంతేకాదు.. కొత్త గెటప్‌లలో బన్ని అదరగొడుతున్నారు. అల్లు అర్జున్ రెగ్యులర్‌గా తన సోషల్ మీడియాలో వెరైటీ గెటప్‌లతో ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. బన్ని స్టైలిష్ ఫోటోలు సూపర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా బన్ని
అల్లు అర్జున్ (Allu Arjun) పలు ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నారు. 'ఆహా', 'OLX', 'Colgate', 'రాపిడో', 'జొమాటో, రెడ్ బస్, అస్ట్రాల్, కేఎఫ్‌సీ వంటి యాడ్స్‌లో నటించారు. అల్లు అర్జున్ ఒక్కో యాడ్ కోసం రూ. 7.5 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. అల్లు అర్జున్ ఫాలోయింగ్ చూసిన పలు సంస్థలు తమ బ్రాండ్లకు ప్రచార కర్తగా నియమించుకోవాలని చూస్తున్నాయి.
Read More : The South Swag: 'ఇండియా టుడే మ్యాగజైన్' పై అల్లు అర్జున్ (Allu Arjun) ఫోటో !
Follow Us