అఖిల్ అక్కినేని (Akhil Akkineni ).. ప్రస్తుతం టాలీవుడ్ యువ హీరోలలో తనకంటూ నెమ్మదిగా ఒక ఇమేజ్ను ఏర్పరచుకుంటున్న నటుడు. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachelor) సినిమా చేసిన అఖిల్.. ఇప్పుడు తాజాగా నటిస్తున్న చిత్రం 'ఏజెంట్. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
'ఏజెంట్' సినిమా ట్రైలర్ ఈ నెల 15 తేదిన విడుదల కానున్నట్లు ఆ సినిమా నిర్మాతలు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఇదే చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల చెంతకు వస్తుందని కూడా పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, సురేందర్ రెడ్డి (Surender reddy) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తమన్ ఈ సినిమా గీతాలకు బాణీలను సమకూర్చగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వక్కంతం వంశీ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
సిక్స్ ప్యాక్‌తో అఖిల్
ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తారట. పూర్తిగా స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అఖిల్ (Akhil Akkineni) ఈ చిత్రానికి ఒక పైసా కూడా రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని టాక్. సినిమా బడ్జెట్‌ని, నిర్మాతల అవసరాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సినిమా విడుదలయ్యాక, చిత్రం హిట్ అయితే.. అప్పుడు లాభాల్లో వాటా తీసుకుంటానని, ప్రస్తుతానికి రెమ్యూనరేషన్ వద్దని అఖిల్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
సినిమాపై భారీ అంచనాలు
ఈ సినిమాపై అక్కినేని అభిమానులలో భారీ అంచనాలే ఉన్నాయి. అతనొక్కడే, కిక్, అతిథి, రేసుగుర్రం, ధ్రువ, సైరా లాంటి డిఫరెంట్ సబ్జెక్టులను డీల్ చేసిన సురేందర్ రెడ్డి, ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారంటే, అభిమానులు కచ్చితంగా ఏదో విషయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారన్నది సత్యం.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. స్టైలిష్ గెటప్‌లో అఖిల్ ఈ ఫస్ట్ లుక్‌లో సూపర్‌గా ఉన్నాడని ఇప్పటికే ఈయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దాదాపు రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట.
Read More: సుదీప్ మైండ్ సెట్ ఎంతో పవర్ఫుల్.. అక్కినేని అఖిల్ (Akhil) ఆసక్తికర వ్యాఖ్యలు!
Follow Us