HBD Surender Reddy : హ్యాపీ బర్త్ డే సురేందర్ రెడ్డి - యాక్షన్ ఏజెంట్‌తో కిక్ ఇవ్వనున్న దర్శకుడు

HBD Surender Reddy : దర్శకుడు సురేందర్ రెడ్డికి ప్రభాస్, పవన్‌ కళ్యాణ్ సినిమాలకు డైరెక్టర్‌గా వ్యవహరించాలనే డ్రీమ్ ఉందట.

HBD Surender Reddy : టాలీవుడ్ దర్శకుల్లో సురేందర్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదటి సినిమా 'అతనొక్కడే' తోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సురేందర్ రెడ్డి పలువురు అగ్ర హీరోలతో సినిమాలను రూపొందించారు. మెగాస్టార్ చిరంజీవితో 'సైరా' చిత్రం రూపొందించి సురేందర్ రెడ్డి స్టార్ దర్శకుడిగా మారారు. ప్రస్తుతం దర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్‌తో 'ఏజెంట్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సురేందర్ రెడ్డి బర్త్ డే సందర్భంగా పింక్ విల్లా ప్రత్యేక కథనం.  

సురేందర్ రెడ్డి 1975 డిసెంబర్ 7 తేదీన కరీంనగర్ జిల్లా మాచినపల్లిలో జన్మించారు. తండ్రి వీరారెడ్డి రాజకీయ నేత. సురేందర్ రెడ్డి చిన్ననాటి నుంచి సినిమా రంగంలోకి రావలనే ఆశ ఉండేది. సినిమాలపై ఆసక్తితో డిగ్రీ మధ్యలోనే చదువు ఆపేసి హైదరాబాద్ వచ్చేశారు.

క్రాంతికుమార్ వద్ద అసోసియేట్ దర్శకుడిగా పనిచేశారు. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 

సురేందర్ రెడ్డి (Surender Reddy) 'అతనొక్కడే' సినిమా కథను సొంతగా రాసుకున్నారు. ఈ సినిమా కథను హీరో కళ్యాణ్ రామ్‌కు చెప్పారు. కళ్యాణ్ రామ్‌కు సురేందర్ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో 'అతనొక్కడే' చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు.

సురేందర్ రెడ్డి తొలి సినిమా 'అతనొక్కడే'తో బ్లాక్ బాస్టర్ హిట్‌ అందుకున్నారు. పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. తొలి సినిమాతోనే సురేందర్ రెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన రెండో సినిమా 'అశోక్'. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌, సమీరా రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించారు. మహేష్ బాబుతో 'అతిథి' సినిమాను రూపొందించారు. 

మాస్ మహారాజ్ రవితేజ, సురేందర్ రెడ్డి కాంబోలో తెరెక్కిన 'కిక్' సూపర్ హిట్‌గా నిలిచింది. 'కిక్' సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా నటించారు.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'అశోక్' చిత్రం తరువాత తెరకెక్కిన మరో సినిమా 'ఊసరవెల్లి'. ఈ సినిమా సురేందర్ రెడ్డికి అనుకున్నంత హిట్ ఇవ్వలేదు.

అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కిన 'రేసు గుర్రం' చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 'రేసుగుర్రం' సినిమాతో దర్శకుడు సురేందర్ రెడ్డి మరింత పాపులర్ అయ్యారు. 

'రేసు గుర్రం' సినిమా తరువాత సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో రిలీజ్ అయిన 'కిక్ 2', 'ధృవ' ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయాయి.

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'సైరా' చిత్రాన్ని తెరకెక్కించారు సురేందర్ రెడ్డి. నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించారు. తెలుగు రాష్ట్రాల్లో 'సైరా' చిత్రం ప్రభంజనం సృష్టించింది. 

'సైరా' సినిమాను అద్భుతంగా రూపొందించిన సురేందర్ రెడ్డి  (Surender Reddy) కి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గ్రేట్ డైరెక్టర్ కెవి రెడ్డి పేరిట ప్రతి ఏడాది ప్రధానం చేసే అవార్డును అందించారు.

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్నారు. యాక్షన్ చిత్రంగా 'ఏజెంట్ 'బ్లాక్ బాస్టర్ హిట్ అవడం ఖాయమని పలువురు సినీ ప్రముఖులు అంటున్నారు. ఈ సినిమా హీరో అఖిల్‌కు, దర్శకుడు సురేందర్ రెడ్డికి భారీ హిట్ ఇస్తుందని భావిస్తున్నారు.

Read More: Mahanati Savitri Birth Anniversary: "నటనను ఆరాధించిన మహానటి" - సావిత్రి జయంతి సందర్భంగా పింక్ విల్లా ప్రత్యేక కథనం.

దర్శకుడు సురేందర్ రెడ్డి విభిన్న సినిమాలతో ప్రేక్షకులకు వినోదం పంచాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే సూరి.
పింక్ విల్లా
You May Also Like These