స‌ర్కారువారి పాట ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా (Mahesh Babu) మ‌హేష్ బాబు.. వీడియో వైర‌ల్!

Published on May 09, 2022 05:23 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన ట్రైలర్, పాటలకు అభిమానులు, ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ఇక విడుద‌ల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన టీం తాజాగా ఓ ఇంటర్వ్యూని రిలీజ్ చేశారు. యాంకర్ సుమతో మహేష్ బాబు, డైరెక్టర్ పరశురామ్ ఇంటర్వ్యూని విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో మహేష్ చాలా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఇక‌, ఇప్పటికే దర్శకుడు, హీరోయిన్ క‌లిసి ఇచ్చిన ఓ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media)వైర‌ల్ అవుతోంది. ఈ ఇంట‌ర్వ్యూలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాను తెరకెక్కించామ‌ని దర్శకుడు వివరణ ఇచ్చాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల ఒక అతిపెద్ద ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం స్వ‌యంగా మ‌హేష్ బాబు రంగంలోకి దింపారు. ప్రత్యేకమైన ఇంటర్వ్యూల‌తో మ‌హేష్ బాబు తనదైన శైలిలో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. చిత్ర యూనిట్ సభ్యులందరితో చేయ‌బోయే ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిల‌వ‌నున్నట్లు సమాచారం. ఇక‌, హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ప్రత్యేకంగా కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇవ‌న్నీ చూస్తుంటే ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వ‌చ్చే విధంగా ప్రమోషన్స్ నిర్వాహ‌కులు ప్లాన్ చేయ‌బోతున్నట్లు తెలుస్తోంది. మరి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ముందు ముందు ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఈ క‌మ్రంలో ఓ ఇంటర్వ్యూలో మహేష్ (Mahesh Babu) ని సుమ ఏం తింటారు? తినరు అని అడిగింది. దీంతో మహేష్ కొన్ని విషయాలని షేర్ చేసుకున్నారు. మహేష్ మాట్లాడుతూ.. "చాలా వరకు అన్నీ తింటాను, కానీ లిమిట్స్ లో తింటాను. పెరుగు, డైరీ ప్రోడక్ట్స్, పిజ్జాలు, బర్గర్, బ్రెడ్, జంక్ ఫుడ్ లాంటివి అస్సలు తినను. పిల్లలతో ఉన్నప్పుడు సరదాగా స్వీట్స్ లాంటివి కొన్ని తింటాను వాళ్ళ కోసం. ఆల్మండ్ మిల్క్ తో చేసిన పదార్థాలు తింటాను. దాదాపు ఒక 10 ఏళ్లకు పైనుంచే ఫుడ్ లో కేర్ తీసుకుంటున్నాను. మొదట కష్టంగా ఉంటుంది కానీ తర్వాత అలవాటయిపోతుంది" అని తెలిపారు.