‘ఆదిపురుష్’ (Adipurush) తప్పకుండా అందరికీ నచ్చుతుంది.. కావాలంటే నోట్ రాసిస్తా: ఓం రౌత్ (Om Raut)

‘ఆదిపురుష్’ (Adipurush) బిగ్ స్క్రీన్స్‌లో చూసే సినిమా అని.. ఇది అందరికీ నచ్చుతుందని దర్శకుడు ఓం రౌత్ (Om Raut) అన్నారు

‘ఆదిపురుష్​’ (Adipurush) చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆ సినిమా దర్శకుడు ఓం రౌత్ మరోమారు స్పష్టం చేశారు. ఇది బిగ్ స్క్రీన్స్‌లో చూడాల్సిన సినిమా అని ఆయన అన్నారు. ‘ఆదిపురుష్​ మిమ్మల్ని అస్సలు నిరాశపర్చదు. ఈ విషయాన్ని కావాలంటే నేను మీకు నోట్ రాసిస్తా’ అని ఓం రౌత్ పేర్కొన్నారు. 

‘ఆదిపురుష్’ బిగ్ స్క్రీన్స్‌లో చూడటం కోసం తీసిన సినిమా అని ఓం రౌత్ అన్నారు. ఈ చిత్రంలోని రాఘవ పాత్రను ప్రభాస్ కోసమే రాశానన్నారు. ప్రభాస్ ఒప్పుకోకపోతే ‘ఆదిపురుష్​’ను తెరకెక్కించేవాడ్ని కాదని ఓం రౌత్ పేర్కొన్నారు. ఈ మూవీలో ప్రభాస్ నటన అద్భుతంగా ఉంటుందన్నారు. 

ఇకపోతే, ‘ఆదిపురుష్’ (Adipurudh) సినిమాను వివాదాలు వదలడం లేదు. రాముడు, రావణాసురుడి పాత్రలను అవమానపర్చేలా టీజర్ (Adipurush Teaser) ఉందంటూ ‘ఆదిపురుష్​’ మేకర్స్‌పై ఫిర్యాదు నమోదైంది. ఈ నేపథ్యంలో ‘ఆదిపురుష్​’ చిత్ర బృందానికి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఢిల్లీ హైకోర్టు (High Court of Delhi)లో పిటిషన్ దాఖలైంది. మూవీ యూనిట్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది ఆశిష్ రాయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. ప్రభాస్‌‌తోపాటు ‘ఆదిపురుష్‌’ చిత్ర యూనిట్‌కు నోటీసులు జారీ చేసింది.

కాగా, ఓం రౌత్ (Om Raut) తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’​ చిత్రంలో ప్రభాస్ సరసన జానకి పాత్రలో కృతీ సనన్ నటిస్తున్నారు. రావణుడి పాత్రలో సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘ఆదిపురుష్’ చిత్రం.. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక టీజర్‌పై ట్రోల్స్, విమర్శలు వెల్లువలా రావడంతో ‘ఆదిపురుష్’ టీమ్ అలర్ట్ అయ్యారు. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరింత శ్రద్ధతో పని చేస్తున్నారని సమాచారం. త్వరలోనే సరికొత్త టీజర్‌తో ఆడియెన్స్ హృదయాలను గెలుచుకోవాలని భావిస్తున్నారట. మరి, ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీతో ఎన్ని సంచనాలు సృష్టిస్తారో వేచి చూడాలి. 

Read more: ‘ఆదిపురుష్’ (Adipurudh)ను వదలని వివాదాలు.. మూవీ యూనిట్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు! 

You May Also Like These