Janhvi Kapoor: జాన్వీ కపూర్ తాజా సినిమా 'గుడ్ లక్ జెర్రీ' సినిమాపై నయనతార ప్రశంసలు.. ఆనందంలో బాలీవుడ్ బ్యూటీ!

లేడీ సూపర్ స్టార్ నయనతారకి (Nayanathara) తన నటన నచ్చడంతో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సంతోషంతో ఉబ్బి తబ్బిబవుతోంది.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా తెరకెక్కిన తాజా మూవీ 'గుడ్ లక్ జెర్రీ' (Good Luck Jerry). సౌతిండియా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటించిన 'కొలమావు కోకిల'కు చిత్రానికి రీమేక్‌ ఇది. కాగా, 'గుడ్ లక్ జెర్రీ' సినిమా జులై 29న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. 

'గుడ్ లక్ జెర్రీ' (Good Luck Jerry) సినిమాలో జాన్వీ నటనకు ఆడియన్స్‌ నుంచి మాత్రమే కాకుండా సినీ ప్రముఖుల నుంచి సైతం ప్రశంసలు అందుతున్నాయి. ఇదిలా ఉంటే మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల జాన్వీ ఓ చానల్‌తో ముచ్చటింది. ఈ సందర్భంగా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార తనపై ప్రశంసలు కురిపించిందంటూ ఆనందం వ్యక్తం చేసింది ఈ బ్యూటీ.

లేడీ సూపర్ స్టార్ నయనతారకి (Nayanathara) తన నటన నచ్చడంతో ఈ యంగ్ బ్యూటీ సంతోషంతో ఉబ్బి తబ్బిబవుతోంది. దీంతో జాన్వీ కపూర్ స్వయంగా నయనతార నంబర్ తీసుకుని తన సంతోషాన్ని తెలియజేస్తూ మెసేజ్ 'గుడ్ లక్ జాన్వీ'.. కెరీర్ బిగినింగ్ లోనే ఇటువంటి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ఎంచుకున్నందుకు గర్విస్తున్నా, నీకు అభినందనలు అంటూ ఆమె మెసేజ్ పెట్టిందట. ఈ విధంగా జాన్వీ కపూర్ లేడీ సూపర్ స్టార్ దగ్గర మార్కులు కొట్టేసింది.

ఈ సందర్భంగా జాన్వీ (Janhvi Kapoor) మాట్లాడుతూ, ఈ మూవీ పై లేడీ సూపర్ స్టార్ నయనతార పాజిటివ్ గా స్పందించారనే వార్త ఇటీవల తాను విన్నానన్నారు. అనంతరం ఆమె ఫోన్ నెంబర్ సంపాదించి ఆమెకు సంతోషం వ్యక్తం చేస్తూ మెసేజ్ చేశాను, దానికి ఆమె రిప్లై ఇస్తూ, తాను ఎప్పటికీ మర్చిపోలేనని, అంతటి పేరున్న నటి నాకు ఈ విధంగా అభినందనలు తెలపడం అమితానందాన్నిచ్చిందని అన్నారు జాన్వీ.

Read More: నయనతార (Nayanthara) స్టార్ హీరోయిన్ కాదంటూ కరణ్ జోహార్ (Karan Johar) వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ఫైర్!

Credits: Instagram
You May Also Like These