Rudrudu : 'రుద్రుడు' ఫస్ట్ లుక్‌ నిజంగానే అదుర్స్ ! రాఘవ లారెన్స్ (Raghava Lawrence) నట విశ్వరూపం ఇదే !

రాఘ‌వా లారెన్స్ (Raghava Lawrence) రుద్రుడు ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.  

రాఘ‌వా లారెన్స్ (Raghava Lawrence) కొరియోగ్రాఫ‌ర్‌గా దక్షిణ సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అయ్యారు. డాన్స్ మాస్ట‌ర్‌గా కాకుండానే న‌టుడిగా కూడా ఆయన సౌత్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. 'కాంచ‌న' సినిమా ఒక రకంగా రాఘ‌వ లారెన్స్ జీవితాన్నే మార్చేసిందని చెప్పవచ్చు.

'కాంచన' సీక్వెల్స్‌లో విభిన్న పాత్రల ద్వారా ఆయన తన అభిమానులను మెప్పించారు.ప్రస్తుతం రాఘ‌వ లారెన్స్ మ‌రో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. లారెన్స్ న‌టిస్తున్న 'రుద్రుడు' సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. 

'రుద్రుడు' సినిమాలో రాఘ‌వ లారెన్స్ (Raghava Lawrence) సీరియ‌స్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు. కాంచ‌న సినిమాలో దెయ్యాలు, ఆత్మ‌లకు భయపడే వ్యక్తిగానూ..  అలాగే ఆత్మ సోకిన వ్యక్తిగానూ రాఘ‌వ లారెన్స్  రెండు విభిన్న పాత్రలలో న‌టించారు. 

పూర్తిగా వెరైటీ కథతో

ఆ క‌థ‌ల‌కు భిన్నంగా రుద్రుడు  ఒక వెరైటీ కథతో జనం ముందుకు రావడం విశేషం.   'దెయ్యాలు పుట్టవు .. సృష్టించబడతాయి' అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా విడుద‌ల కానుంది. ఫైవ్ స్టార్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై ఈ సినిమా తెర‌కెక్కుతోంది. రుద్రుడు ఫ‌స్ట్ లుక్‌ను ఈ రోజే మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

కథానాయికగా ప్రియా భవాని శంకర్ 

'రుద్రుడు' సినిమాలో రాఘ‌వా లారెన్స్‌ (Raghava Lawrence) కు జోడిగా ప్రియా భ‌వాని శంక‌ర్ న‌టిస్తున్నారు. సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ కుమార్ కూడా ఓ కీల‌క పాత్ర‌ పోషిస్తున్నారు. ఈ సినిమా కథిరేసన్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్త‌యింది. త‌మిళ్‌తో పాటు తెలుగు, మ‌ళ‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో కూడా రుద్రుడు రూపొందనుంది. ఈ చిత్రం డిసెంబ‌ర్ నెల‌లో క్రిస్మ‌స్ పండుగ‌కు విడుద‌ల కానుంది. 

Read More: Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ టాప్ 10 చిత్రాలు.. ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిందే !

You May Also Like These