బ్రిటన్ దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన క్వీన్ ఎలిజబెత్ 2 (Queen Elizabeth) గురువారం కన్నుమూశారు. 96 సంవత్సరాల క్వీన్ ఎలిజబెత్ 2 సేవలను కొనియాడుతూ, విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఆమెకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా క్వీన్ ఎలిజబెత్ 2 తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. మహారాణితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. క్వీన్ మరణం తనను ఎంతో బాధించిందని కమల్ హాసన్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
నా సినిమా కోసం క్వీన్ వచ్చారు : కమల్
నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) క్వీన్ ఎలిజబెత్ 2 మృతికి సంతాపం తెలిపారు. 70 ఏళ్ల పాటు బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించిన క్వీన్‌ను కమల్ హాసన్ రెండు సార్లు కలిశారు. మొదటి సారి 1997లో క్వీన్ భారత్ పర్యటనకు వచ్చారు. అదే సమయంలో కమల్ హాసన్ 'మరుదనాయగం' సినిమా ఈవెంట్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాకి సంబంధించిన భారీ యుద్ధ సన్నివేశాన్నిఅప్పట్లో రూ.1.5 కోట్లతో షూట్ చేశారు. ఈ షూటింగ్ సెట్‌లో క్వీన్ దాదాపు 20 నిమిషాల పాటు గడిపారు.
తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలని కమల్ హాసన్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ సినిమా కొన్ని కారణాల చేత ఆగిపోయింది. కానీ క్వీన్ ఎలిజబెత్ 2 తన సినిమా కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా రావడం గొప్ప విషయం అని కమల్ పేర్కొన్నారు. కమల్ హాసన్ 2017లో బ్రిటన్‌లోని బకింగ్‌హ్యామ్ పాలెస్‌లో క్వీన్ ఎలిజబెత్-2 ను రెండో సారి కలిశారు. కమల్ హాసన్‌ను చూసిన క్వీన్.. 'మరుదనాయగం' సినిమా ఈవెంట్‌కు హాజరైన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.
క్వీన్‌ను కోల్పోవడం బాధాకరం - కమల్
కమల్ హాసన్ (Kamal Haasan) తన సోషల్ మీడియాలో క్వీన్‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు. క్వీన్ మరణించిన బాధ బ్రిటిష్ వారికే కాదని.. ప్రపంచం మొత్తానికని ట్వీట్ చేశారు. 25 ఏళ్ల క్రితం 'మరుదనాయగం' మూవీ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యారని గుర్తు చేసుకున్నారు. క్వీన్ హాజరైన ఏకైక సినిమా షూటింగ్ తనదేనేమో అన్నారు.
ఐదేళ్ల క్రితం లండన్‌లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో క్వీన్‌ను రాజభవనంలో కలవడం ఇప్పటికీ గుర్తుందన్నారు. క్వీన్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్ ప్రజలకు, రాజకుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.
Read More: 'విక్రమ్' (Vikram) 100 రోజుల పండుగ.. కమల్ హాసన్ (Kamal Haasan) సినిమా కొత్త రికార్డు
Follow Us