అంకుర్ హాస్పిటల్స్‌లో జరిగిన కార్యక్రమంలో సోనూసూద్ (Sonu Sood)

Published on Apr 21, 2022 04:15 PM IST

కరోనా వ్యాప్తి సమయంలో నిజంగా అవసరం ఉన్న వారిని ఆదుకున్న యాక్టర్‌‌, సోషల్‌ యాక్టవిస్‌ సోనూసూద్‌... తెలుగు రాష్ట్రాల్లో పేరుపొందిన అంకుర్ హాస్పిటల్స్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అంకుర్ హాస్పిటల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌‌గా ఉన్న సోనూసూద్.. ఆ సంస్థ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా తనవంతు సహాయం అందిస్తున్నాడు. 
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని పలు బ్రాంచీలు ఉన్న అంకుర్ హాస్పిటల్స్‌.. మహారాష్ట్ర, కర్నాటక, ఒరిస్సాలో కూడా తన కార్యకలాపాలను విస్తరించబోతోంది.