బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల సునామీలో (Mahesh Babu) మ‌హేష్ బాబు 'స‌ర్కారు వారి పాట‌'..!

Published on May 14, 2022 02:27 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన తాజా సినిమా 'సర్కారు వారి పాట'. డైరెక్టర్ పరశురాం, మహేష్ బాబు కాంబోలో భారీ ప్రీ బిజినెస్‌ను జరుపుకున్న ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అనేక వాయిదాల తర్వాత విడుద‌లైన‌ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కాగా, సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేయ‌గా.. థమన్ సంగీతం అందించారు. 

కాగా, ఈ సినిమా మొదటి రోజే రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టగా రెండో రోజు కూడా కలెక్షన్స్ జోరు చూపించింది. దీంతో చిత్ర‌యూనిట్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ (Tollywood) ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు, డిస్ట్రిబ్యూట‌ర్లు, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ నేప‌థ్యంలో ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కాగా, స‌ర్కారు వారి పాట సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. 

ఇక‌, ఈ సినిమాకు రూ. 120 కోట్లు మేర బిజినెస్ జరిగింది. ఏరియాల వారిగా చూస్తే.. నైజాంలో రూ.36 కోట్లు, సీడెడ్‌లో రూ.13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.12.50 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.8.50 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ.7 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.9 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.7.5 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.4 కోట్ల బిజినెస్ చేసింది. ఏపీ, తెలంగాణలో మొత్తంగా రూ.97 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ (PreRelease Business) చేసింది. ఇక‌, ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం రూ.121 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించాలి. తొలి రోజు తర్వాత ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే తక్కువలో తక్కువ ఇంకా 62.85 కోట్లకు పైగా వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. అయితే, రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్‌లో కలెక్షన్లు రాబడుతుందో అనేది వేచి చూడాల్సిందే.