యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచుతారు. మీడియాతో కూడా చాలా తక్కువగా టచ్‌లో ఉంటారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో తన సినిమా విశేషాలను మాత్రమే షేర్ చేసే చైతన్య పర్సనల్ లైఫ్‌పై పలు రూమర్స్ వస్తున్నాయి.
హీరోయిన్ సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత, నాగచైతన్య వ్యక్తిగత విషయాలపై ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్‌తో చైతన్య డేటింగ్లో ఉన్నారనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. తనపై వస్తున్న రూమర్లు, హీరోయిన్‌తో ప్రేమాయణం వంటి వార్తలపై మొదటిసారి స్పందించారు నాగచైతన్య.
నాగచైతన్య ప్రస్తుతం ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో మీడియాతో ముచ్చటించారు చైతన్య (Naga Chaitanya). ఈ మీడియా సమావేశంలో హీరోయిన్‌తో డేటింగ్ రూమర్స్‌పై జర్నలిస్టులు ప్రశ్నించారు. ఈ అంశంపై నాగచైతన్య స్పందించారు.
పట్టించుకోవడం మానేశా..
‘ఈ మధ్య నాపై రూమర్లు ఎక్కువగా వస్తున్నాయి. ప్రతివారం ఏదో ఒక వార్త బయటకు వస్తోంది.వాటిని చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తోంది. నా జీవితానికి అసలు సంబంధమే లేని పుకార్లను సృష్టిస్తున్నారు. అసలు అవి ఎలా వస్తున్నాయో కూడా అర్థం కావడం లేదు. ప్రారంభంలో వాటిని చూసి నవ్వుకునే వాడిని. అయితే ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశాను’ అని సమాధానం ఇచ్చారు చైతన్య. అంటే తాను ఏ హీరోయిన్‌తోనూ ప్రేమలో లేనని స్పష్టంగా చెప్పారు చై.
నాగచైతన్యతో నటి శోభిత ధూళిపాళ డేటింగ్లో ఉన్నారంటూ ఓ వార్త సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ఈ పుకార్లను శోభిత ధూళిపాళ కూడా ఖండించారు. ఇకనైనా ఇలాంటి వార్తలకు చెక్ పడుతుందో లేదో వేచి చూడాలి మరి. ఇకపోతే ‘లాల్ సింగ్ చడ్డా‘ సినిమాతో చై బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య(Naga Chaitanya) బాలరాజు అనే ఆర్మీ యువకుడి పాత్రలో నటించారు.
Read More : సమంతతో కలిసి నేను మళ్లీ సినిమా చేస్తే, ఎలా ఉంటుందో తెలుసా ? : నాగచైతన్య (Naga Chaitanya) మనసులోని మాట ఇదే !
Follow Us