Custody Movie: నాగ చైతన్య (Naga Chaitanya) కొత్త లుక్ అదుర్స్ - 'కస్టడీ' సినిమా టాప్ 10 ఆసక్తికర విశేషాలు..

నాగ చైతన్య (Naga Chaitanya) కొత్త సినిమా 'కస్టడీ' నుంచి మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చై ఆవేశంతో ఉన్న పోస్టర్ ట్రెండ్ అవుతోంది.

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) పుట్టిన రోజు సందర్భంగా NC22 టైటిల్‌ను రివీల్ చేశారు మేకర్స్. నాగ చైతన్య నటిస్తున్న 22 వ సినిమా 'కస్టడీ' అని ప్రకటించారు. పోలీసులు నాగ చైతన్యను పట్టుకుని.. అతనిపై గన్స్ ఎక్కుపెట్టిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సంవత్సరంలో నాగ చైతన్య సినిమాలు సక్సెస్ సాధించాయి. 'కస్టడీ' పోస్టర్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. 'కస్టడీ' సినిమాకు సంబంధించిన టాప్ 10 ఆసక్తికర విశేషాలు పింక్ విల్లా ఫాలోవర్స్ కోసం..

  1. నాగ చైతన్య (Naga Chaitanya) నటిస్తున్న 22 వ సినిమా 'కస్టడీ'. ఈ సినిమాలో చై పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారు. స్టార్ డమ్ పక్కన పెట్టి నాగచైతన్య ఓ సాధారణ కానిస్టేబుల్ పాత్రలో నటించడం పెద్ద సాహసమే.
  2. ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'కస్టడీ'.
  3. 'కస్టడీ' సినిమాలో నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి నటిస్తున్నారు. బంగ్రారాజు సినిమాలో చై, కృతి శెట్టి కాంబోకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మరోసారి వీరిద్దరు 'కస్టడీ' సినిమాతో వెండితెరపై కనువిందు చేయనున్నారు. 
  4. దర్శకుడు వెంకట ప్రభు 'కస్టడీ' సినిమాను తెలుగుతో పాటు తమిళ భాషలోనూ చిత్రీకరిస్తున్నారు. 
  5. క్రైమ్, థ్రిల్లర్ జోనర్‌లో నాగచైతన్య నటిస్తున్న 'కస్టడీ' చిత్రం విడుదల కానుంది.
  6. 'కస్టడీ' చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజాతో పాటు ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజాలు సంగీతం అందిస్తున్నారు. 
  7.  నాగచైతన్య, వెంకట ప్రభు కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు.
  8. ప్రముఖ నటుడు అరవింద స్వామి 'కస్టడీ' చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. 
  9. బుల్లితెరపై వంటలక్క పాత్రలో నటించి స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రేమీ విశ్వనాథ్ 'కస్టడీ' సినిమా ద్వారా మొదటి సారి వెండితెరపై వినోదం పంచనున్నారు.
  10. 'కస్టడీ' సినిమాలో ప్రియమణి, శరత్ కుమార్, సంపత్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

Read More: Happy Birthday Naga Chaitanya : నాగ చైతన్య బర్త్ డే స్పెషల్ - సక్సెస్ దిశగా దూసుకెళుతున్న చై..

You May Also Like These