చిన్న చిత్రంగా రిలీజై మొత్తం భారతావనిని ఊపేసింది ‘కాంతార’ (Kantara) మూవీ. కన్నడ నాట తొలుత విడుదలైన ఈ సినిమా.. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజై సంచలనం విజయాన్ని నమోదు చేసింది. తెలుగులో విడుదలైన తొలి రోజే బ్రేక్ ఈవెన్ సాధించింది. దీపావళికి రిలీజైన సినిమాలతో సమానంగా ‘కాంతార’ వసూళ్లు సాధించింది. ఎక్కువ ప్రమోషన్స్ చేయకున్నప్పటికీ మౌత్ టాక్‌తోనే ఈ మూవీ బంపర్ విక్టరీ కొట్టింది. రూ.16 కోట్లతో తెరకెక్కిన ‘కాంతార’.. రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఒక్క కర్ణాటకలోనే కోటికి పైగా టిక్కెట్లు అమ్ముడై రికార్డు నెలకొల్పింది. ఇతర భాషల్లోనూ డిస్ట్రిబ్యూటర్ల పంట పండించింది.
థియేటర్లలో ఇంకా సందడి చేస్తున్న ‘కాంతార’ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు దీనిపై ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ ఓటీటీ విడుదలకు అంతా సిద్ధమైంది. నవంబర్ 24 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ‘కాంతార’ ఓటీటీ హక్కులు దక్కించుకుంది. వాస్తవానికి ఈ నెల 4వ తేదీనే ఓటీటీలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని భావించారు. కానీ, థియేటర్లలో సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగుతుండటంతో ఓటీటీ స్ట్రీమింగ్‌ను వాయిదా వేశారు. ఎట్టకేలకు వచ్చే వారంలో ప్రైమ్‌లో ఈ బ్లాక్‌బస్టర్ మూవీ అందుబాటులోకి రానుంది.
ఇకపోతే, శాండల్‌వుడ్ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ‘కాంతార’ను స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆయన సరసన సప్తమి గౌడ (Sapthami Gowda) కథానాయికగా యాక్ట్ చేశారు. సీనియర్ నటులు అచ్యుత్ కుమార్, కిషోర్, ప్రమోద్ శెట్టి ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ‘విక్రాంత్ రోణ’ (Vikrant Rona) ఫేమ్ అజినీష్ లోక్‌నాథ్ ‘కాంతార’కు సంగీతం అందించారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హోంబాలే ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ బ్యానర్‌లోనే ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ తెరకెక్కిన సంగతి తెలిసిందే.
Read more: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో విలన్‌గా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)! ఓకే చెప్పాడా.. లేదా?
Follow Us