మీకు చిత్తూరు యాసలో మాట్లాడడం వచ్చా? అయితే ఈ అవకాశం మీకోసమే. పుష్ప ది రూల్ (Pushpa The Rule) సినిమాలో కొత్త నటీనటుల కోసం ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ ఓ ప్రకటనను విడుదల చేశారు. దీని ప్రకారం ఈ సినిమాలో చిత్తూరు భాష పై పట్టు ఉన్న వ్యక్తుల కోసం చూస్తున్నారు. మహిళలు, పురుషులు, పిల్లలు ఎవరైనా సరే.. ఈ ఆడిషనులో పాల్గొనవచ్చు.
తిరుపతిలో ఆడిషన్స్
ఆసక్తి గల వ్యక్తులు జులై 3,4, 5 తేదిలలో తిరుపతిలోని మైక్ మై బేబీ జెన్యూన్ స్కూల్‌లో జరిగే ఆడిషన్స్‌కు హాజరు కావచ్చు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆడిషన్స్ జరగనున్నాయి. పుష్ప ది రూల్ (Pushpa The Rule) సినిమాకి పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ఆడిషన్స్ ప్రోగ్రామ్ జరగనుంది.
పుష్ప ది రైజ్ చిత్రం ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీసు రికార్డులను ఎలా షేక్ చేసిందో మనకు తెలియని విషయం కాదు. సుకుమార్ మ్యాజిక్ ఉత్తరాది ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకుంది. ముంబయి, ఢిల్లీ, భోపాల్, పూణె లాంటి ప్రాంతాలలో కూడా ఈ చిత్రం హిందీ వెర్షన్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ చిత్రం ఏ మేరకు ఉత్తరాది వారిని ఆకట్టుకుందో.
సినిమాపై భారీ అంచనాలు
ఇప్పుడు ప్రతీ ఒక్కరి చూపు పుప్ప ది రూల్ (Pushpa The Rule) సినిమా మీదే ఉంది. ఈ సినిమా సరికొత్త ట్విస్టులతో అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులను అలరించనుంది. ముఖ్యంగా ఫహద్ ఫాజిల్‌తో బన్నీ ఏ మేరకు పోరాడి గెలుస్తాడన్నది ఈ చిత్రంలో ప్రధానాంశం. బన్వర్ సింగ్, పుష్పరాజ్‌ల మధ్య సాగే యుద్ధం ఎలాంటి ప్రభంజం క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
పుష్ప ది రైజ్ (Pushpa The Rise) చిత్రం దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. రూ.365 కోట్ల వసూళ్ళతో బాక్సాఫీసును కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్ ప్రభావం పుష్ప ది రూల్ మీద కూడా పడనుందని టాక్. ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ ఎవరూ ఊహించని రీతిలో ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.
Read More: పుష్ప రాజును విదేశాలకు తీసుకెళుతున్న సుకుమార్!.. అల్లు అర్జున్‌కు పెరుగుతున్న ఫాలోయింగ్
Follow Us