Gowtham Raju : టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు క‌న్నుమూత‌ !

Gowtham Raju: చిరంజీవి (Chiranjeevi) న‌టించిన 'చట్టానికి కళ్లు లేవు' చిత్రంతో ఎడిట‌ర్‌గా గౌత‌మ్ రాజు త‌న సినీ జీవితాన్ని ప్రారంభించారు.

Gowtham Raju : తెలుగు చిత్ర పరిశ్రమ‌లో ఎడిటర్‌గా ఎన్నో సంవత్సరాలు సేవ‌లు అందించిన  గౌతమ్ రాజు తుదిశ్వాస విడిచారు. 68 ఏళ్ల గౌత‌మ్ రాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న గౌత‌మ్ రాజు మంగళవారం రాత్రి కన్నుమూశారు. గౌతమ్ రాజు మరణ వార్తతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. గౌత‌మ్ రాజు ప‌లు భాష‌ల్లో ఎన్నో సినిమాల‌ను అద్భుతంగా ఎడిట్ చేసి ప్రేక్ష‌కుల‌కు అందించారు . 

చిరంజీవి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ
చిరంజీవి
(Chiranjeevi) న‌టించిన 'చట్టానికి కళ్లు లేవు' చిత్రంతో గౌత‌మ్ రాజు ఎడిట‌ర్‌గా త‌న సినీ జీవితాన్ని ప్రారంభించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాలకు గౌతమ్ రాజు ఎడిటర్‌గా పని చేశారు. దాదాపు 800 చిత్రాల‌కు పైగా సినిమాల‌కు ఎడిట‌ర్‌గా సేవ‌లు అందించారు. అగ్ర హీరోల చిత్రాల‌కు ఎడిట‌ర్‌గా ప‌నిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఎన్టీఆర్ సినిమాకు నంది అవార్డు
ఎన్టీఆర్ (N. T. Rama Rao Jr.) న‌టించిన‌ ఆది చిత్రానికి ఎడిటర్‌గా ప‌నిచేసిన‌ గౌత‌మ్ రాజు (Gowtham Raju) నంది అవార్డు అందుకున్నారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు నటించిన ఎన్నో సినిమాలకు ఎడిట‌ర్‌గా పని చేశారు.

ఖైదీ నెంబర్‌ 150, గబ్బర్‌సింగ్‌, కిక్‌, అదుర్స్‌, ఊసరవెల్లి, బద్రీనాథ్‌, బలుపు, గోపాల గోపాల, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, నాయక్, రేసుగుర్రం, అల్లుడు శీను, పవర్, బెంగాల్‌ టైగర్, సౌఖ్యం, డిక్టేటర్‌, అఖిల్‌, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌, కాటమరాయుడు, సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, విన్నర్‌, హైపర్‌, గౌతమ్‌నంద, టచ్‌ చేసి చూడు, పటేల్, ఇంటెలిజెంట్‌, సన్నాఫ్‌ ఇండియా, మోసగాళ్లు, రాజుగారి గది 3, లయన్‌, స్పీడున్నోడు, కిక్‌ 2, పిల్లా నువ్వు లేని జీవితం వంటి చిత్రాలకు గౌతమ్ రాజు ఎడిటర్‌గా పనిచేశారు.

గౌతమ్ రాజు (Gowtham Raju) మృతితో సినీ ప్ర‌ముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్ర‌గాఢ‌ సానుభూతిని తెలిపారు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు గౌతమ్ రాజు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గౌత‌మ్ రాజు మ‌ర‌ణం తెలుగు సినీ రంగానికి తీర‌ని లోట‌న్నారు.

Read More: Telugu Mythological Movies: భార‌త చలనచిత్ర చరిత్ర‌లో నిలిచిన తెలుగు పౌరాణిక చిత్రాలు (టాప్ 10 చిత్ర విశేషాలు)

You May Also Like These