Sree Leela: ‘పెళ్లి సందడి’ బ్యూటీ కోసం క్యూ క‌డుతున్న టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాత‌లు!

Published on May 18, 2022 03:12 PM IST

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree Leela) గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండ‌రు. ‘పెళ్లి సందD’ చిత్రం ద్వారా శ్రీలీల తన గ్లామర్ లుక్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసింది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో పెద్ద హీరోల స‌ర‌స‌న సైతం ఈ బ్యూటీ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. త్వరలోనే ఈ అమ్మ‌డు బాలీవుడ్‌ (Bollywood) లో కూడా ఎంట్రీ ఇవ్వనుందట. అయితే, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఏ నటిని అయినా.. అతిలోక సుందరిగానే చూపిస్తారు. అలాంటిది ఆయన సినిమాతోనే సినీ రంగ ప్ర‌వేశం చేస్తే, ఇంక ఆ నటిపై టాలీవుడ్‌లో ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. 

అంతేకాకుండా, శ్రీలీల (Sree Leela)పై ప్రేక్షకులు మాత్రమే కాదు.. నిర్మాత‌లు సైతం దృష్టిపెట్టారు. అందుకే తన మొదటి సినిమా 'పెళ్లిసందD' విడుదల కాగానే శ్రీలీల చేతిలోకి నాలుగు తెలుగు సినిమా ఆఫర్లు వచ్చిపడ్డాయి. అయితే, ప్రస్తుతం టాలీవుడ్‌లోనే చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈమె. అయినా తాజాగా బాలీవుడ్ నుండి కూడా తనకు పిలువు వచ్చినట్టు టాక్. త్వరలోనే దీని పై అఫిషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే శ్రీలీల కెరీర్‌కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఇదే..అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రోవైపు ఇప్పటికే రష్మిక (Rashmika Mandanna), పూజా హెగ్డే లాంటి హీరోయన్లు.. ఇటు తెలుగుతో పాటు, అటు హిందీ సినిమా ఆఫర్లు కూడా సమానంగా అందుకుంటూ దూసుకుపోతున్నారు. దీంతో శ్రీలీల కూడా త్వరలోనే ఆ జాబితాలో చేరేలా కనిపిస్తోంది. ప్ర‌స్తుతం మాస్ మ‌హారాజ్ రవితేజ (Raviteja) హీరోగా చేస్తున్న 'ధ‌మాకా' సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ త‌ర్వాత‌ ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాలోనూ ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వ‌స్తున్నాయి. అంతేకాదు త్రివిక్రమ్–మహేశ్ సినిమాలో‌నూ అమ్మడు సెకండ్ హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యిందట‌.