Allu Arjun: త్రివిక్రమ్ దర్శకత్వంలో యాడ్ షూట్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ లుక్.. ఫొటోలు వైరల్!

అల్లు అర్జున్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ (Allu arjun Photos Viral) అవుతున్నాయి.

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం 'పుష్ప 2' (Pushpa 2) కోసం సన్నద్ధమవుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఆగస్టు చివరి వారంలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అల్లు అర్జున్ న్యూ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ న్యూ లుక్ పుష్ప 2 కోసమా? అనే వార్తలు వస్తున్నాయి. 

అల్లు అర్జున్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ (Allu arjun Photos Viral) అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఎంతో స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తున్న అల్లువారబ్బాయి ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం వెళ్తున్నారు. ఇందులో ఫ్లోరల్‌ షర్ట్‌, జాగర్స్‌, తలపై హ్యాట్‌తో అర్జున్‌ ఎంతో కూల్‌ లుక్‌లో కనిపించాడు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో కనిపించగానే నెటిజన్స్ లైక్స్‌, కామెంట్స్‌, షేర్లతో హోరెత్తించారు.

అయితే ఇలా ఉన్నట్టుండి బన్నీ తన స్టైల్ మార్చడానికి ఒక కారణం ఉంది. ఓ యాడ్ షూట్ కోసం అర్జున్ ఇలా ఉబెర్ కూల్ దుస్తుల్లోకి మారిపోయినట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Director Trivikram) దర్శకత్వంలో బన్నీ ఓ ప్రకటన షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. 

హ్యాట్రిక్ సూపర్ హిట్ సినిమాలిచ్చిన ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ యాడ్ రావడంపై హ్యాపీ గా ఉన్న ఫ్యాన్స్.. ఇదో ట్రెండ్ సెట్టర్ కావాలని కోరుకుంటున్నారు. మొత్తానికి బన్నీ లేటెస్ట్ లుక్ కు ఫిదా అయిపోయామని చెప్తున్న ఫ్యాన్స్.. ఫొటోలను వైరల్ చేస్తున్నారు.

ఇక, అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే..  పుష్ప 2 సినిమాలో ఫహద్ ఫాజిల్‏తోపాటు తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) సైతం కీలకపాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పుష్ప 2 మాత్రమే కాకుండా పుష్ప 3 కూడా ఉండనున్నట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఫహాద్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప 2 (Pushpa ) సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Read More: “పుష్ప 3” కూడా ఉంటుంది.. ఫాహద్ ఫాజిల్ (Fahadh Faasil) సంచలన వ్యాఖ్యలు..!!

Credits: Twitter
You May Also Like These