Karthikeya 2: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ 'కార్తికేయ 2' ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లను వసూళ్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ల రికార్డుల మోత మోగిస్తుంది. హీరో నిఖిల్ కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఇండియాతో పాటు అమెరికాలోనే 'కార్తికేయ 2' థియేటర్లను షేక్ చేస్తోంది. అమెరికాలో 'కార్తికేయ 2' సినిమా 'బాహుబలి', 'పుష్ప' సినిమాల రికార్డులకు కొల్లగొట్టింది.
అమెరికాలో కార్తికేయ 2 హవా
'కార్తికేయ 2' (Karthikeya 2) సినిమాను అడ్వేంచర్ థ్రిల్లర్‌గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించారు. కార్తికేయ 2 సినిమా విడుదల ఎన్నో సార్లు వాయిదా పడింది. రిలీజ్‌కు ముందు ఎన్నో అడ్డంకులు ఎదురైనా కార్తికేయ 2 విడుదల తరువాత పలు రికార్డులను సృష్టించింది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమాకు ఖర్చు చేసిన బడ్జెట్ వసూళ్లయ్యాయి. కార్తికేయ 2 కలెక్షన్ల పరంగా రూ. 100 కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమా వసూళ్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.
హీరో నిఖిల్ సినిమా కార్తికేయ 2 అమెరికాలో అరుదైన ఘనతను సాధించింది. అమెరికాలో 1.5 మిలియన్ డాలర్లను రాబట్టింది. ఈ సినిమా విడుదలై నాలుగు వారాలు అవుతున్నా.. యూఎస్ఏలో 80 థియేటర్లకు పైగా షోలు రన్ అవుతున్నాయి. నాల్గో వారంలో అత్యంత ఎక్కువ లొకేషన్లలో ప్రదర్శితమవుతున్న తెలుగు సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది.
ద్వారక నగర రహస్యాలు తెలిపే సినిమా
కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకున్నాక, ద్వారక నగరంలో కొన్ని అద్భుత రహస్యాలను చేధించే ఓ యువకుడి సాహస గాథే ఈ సినిమా. 'పుష్ప' తర్వాత ఆ రేంజ్‌లో 'కార్తికేయ 2' సినిమాకు నార్త్‌లో డిమాండ్ ఏర్పడింది. నిఖిల్‌కు జోడిగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటించారు.
ఈ చిత్రంలో కృష్ణ తత్వాన్ని ప్రచారం చేసే ధన్వంతరి పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ నటించి మెప్పించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
Read More: Karthikeya 2: 'కార్తికేయ 2' సక్సెస్ సంబురాలు... గర్వంగా ఉందన్న హీరో నిఖిల్(Nikhil Siddhartha)
Follow Us