హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రతిభ ఉన్న డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి కొంతమంది హీరోలు ఎప్పుడూ రెడీగా ఉంటారు. అటువంటి హీరోల లిస్ట్‌లోకి చేరుతున్నాడు నేచురల్ స్టార్ నాని (Nani). వరుస హిట్లతో జోరు మీదున్న సమయంలో 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో నానీలో ప్లాప్ సినిమా తీశాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. నానితో డబుల్ రోల్ చేయించి డిజాస్టర్ రుచి చూపించాడు. హీరోయిన్ల కిడ్నాప్ డ్రామాల కథతో తెరకెక్కించిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు.
అయితే ఆ సినిమా పరాజయాన్ని కూడా నాని కథలో లోపంగానే తీసుకున్నాడు తప్పితే.. దర్శకుడి టాలెంట్‌ను మాత్రం అనుమానించలేదు. అందుకేనేమో మేర్లపాక గాంధీకి అవకాశం ఇచ్చాడని, త్వరలోనే గాంధీ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని సమాచారం.
కామెడీ ఎంటర్టైనర్?
'కృష్ణార్జునయుద్ధం’ చిత్రం తర్వాత సంతోష్ శోభన్‌తో ‘ఏక్ మినీ కథ’, నితిన్‌తో ‘మాస్ట్రో’ సినిమాలు తీసి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు మేర్లపాక గాంధీ. ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా ‘లైక్ షేర్ సబ్‌స్ర్కైబ్’ పేరుతో వెరైటీ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత నాని హీరోగా గాంధీ ఓ కామెడీ ఎంటర్టైనర్ను తెరకెక్కించనున్నట్టు సమాచారం.
ఇప్పటికే గాంధీ చెప్పిన కథ నానికి బాగా నచ్చిందని, దీంతో స్క్రిప్ట్ వర్క్‌పై గాంధీ టీమ్ పనిచేస్తోందని టాక్. సంతోష్ శోభన్ చిత్రం హిట్ అయిందంటే.. మేర్లపాక గాంధీకి నాని నుంచి పూర్తి స్థాయిలో అంగీకారం లభించినట్టే. అతి త్వరలో ఈ సినిమా గురించిన పూర్తి సమాచారం తెలియనుంది. మరి గాంధీ ఈ సారైనా నానికి మంచి హిట్ సినిమా ఇస్తాడో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
ఇక, నాని – నజ్రియా జంటగా నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ఇటీవలే రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ప్రస్తుతం నాని తన తర్వాత సినిమాపై ఫోకస్ పెట్టే చాన్స్ ఉంది. ఇన్నాళ్లూ 'అంటే సుందరాని'కీ సినిమా షూటింగ్, సినిమా ప్రమోషన్స్ పనుల్లో బిజీబిజీగా ఉన్న నాని (Nani).. ఇటీవలే తన కొడుకుతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Read More: (అంటే.. సుందరానికీ రివ్యూ) : పంచెకట్టుతో సాహసం చేసిన 'నాని' !
Follow Us