నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) చేతుల మీదుగా ‘తారకరామ’ థియేటర్ సరికొత్త సదుపాయాలతో పున:ప్రారంభం..!

మరమ్మతులలో భాగంగా ‘ఏషియన్ తారకరామ’ (Asian Tarakarama) థియేటర్ లో రెక్లైనర్ సీట్లు, సోఫాలు ఏర్పాటు చేశారు.

టాలీవుడ్ న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) ‘ఏషియ‌న్ తార‌క‌రామ’ థియేట‌ర్ ను నేడు ప్రారంభించారు. హైదరాబాద్ లోని కాచిగూడ వద్ద నంద‌మూరి కుటుంబానికి చెందిన ‘తార‌క‌రామ’ థియేట‌ర్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ థియేటర్ కొన్నేళ్లుగా పనిచేయకుండా ఉంది. దీంతో కాసేపటి క్రితం బాలకృష్ణ కాసేపటి క్రితమే ప్రారంభించారు. 

తారకరామ థియేటర్ ను సీనియర్ ఎన్టీఆర్ (NTR) కు స్నేహితుడు, సన్నిహితుడు అయినటువంటి సినీ నిర్మాత నారాయణ్ కే దాస్ నారంగ్ కుమారుడు సునీల్ నారంగ్ ఇటీవల మరమ్మతులు చేపట్టారు. అంతేకాకుండా పూర్తిగా కొత్త టెక్నాలజీతో 4కే ప్రొజెక్ష‌న్, సుపీరియర్ సౌండ్ సిస్ట‌మ్ ను అమ‌ర్చారు. ఇక, 975సీట్ల కెపాసిటీ ఉన్న థియేటర్ ను 590కి తగ్గించారు. దీంతో ప్రేక్షకులు సినిమా చూసే అనుభూతి పూర్తిగా మెరుగుపడనుంది. 

మరమ్మతులలో భాగంగా ‘ఏషియన్ తారకరామ’ (Asian Tarakarama) థియేటర్ లో రెక్లైనర్ సీట్లు, సోఫాలు ఏర్పాటు చేశారు. ఇంటీరియర్ వర్క్ కూడా అద్బుతంగా డిజైన్ చేశారు. ఈ నెల 16 నుంచి ఇందులో సినిమాల ప్రదర్శన జరగనున్నట్లు తెలుస్తోంది. 16వ తేదీన విడుదల కాబోతున్న ‘అవ‌తార్ 2’ తో ఈ థియేట‌ర్ రీఓపెన్ కానుండ‌గా.. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న బాల‌య్య హీరోగా న‌టించిన ‘వీర‌సింహారెడ్డి’ (VeeraSimha Reddy) సినిమాను సైతం ఇందులో ప్ర‌దర్శించనున్నట్లు సమాచారం.

దీంతో ‘అవతార్ 2’ (Avatar 2) వంటి అద్బుతమైన విజువల్ వండర్ సినిమాను ఈ థియేటర్ లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారు. సరికొత్త సదుపాయాలతో పునర్నిర్మించి ఈ థియేటర్ ను నేడు బాలయ్య రిబ్బన్ కట్ చేసిన ప్రారంభించడంతో అభిమానులు అక్కడికి చేరుకొని జై బాల‌య్య అంటూ నినాదాల‌తో హోరెత్తించారు. మ‌రి సీనియర్ ఎన్టీఆర్ గ‌తంలో నిర్మించిన తారకరామ థియేట‌ర్ ఇప్పుడు ఏ మేరకు లాభాల‌ను తెచ్చిపెడుతుందనేది రాబోయే కాలంలో చూడాలి.

Read More: ‘NBK108’: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన అనిల్ రావిపూడి-బాలకృష్ణ మూవీ.. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్!

Credits: Twitter
You May Also Like These