Movie Review: సుధీర్‌‌బాబు (Sudheer Babu) నటించిన ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. భావోద్వేగాల సమ్మోహనం

సుధీర్‌‌బాబు (Sudheer Babu) – మోహనకృష్ణ కాంబినేషన్‌లో నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా ‘సమ్మోహనం’ మంచి విజయాన్ని సాధించింది.

సినిమా పేరు : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

నటీనటులు : సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్

మ్యూజిక్ : వివేక్ సాగర్

నిర్మాతలు : బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి

దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి

విడుద‌ల‌ తేదీ : 16–09–2022

రేటింగ్ : 2.5 / 5

ఎస్‌ఎంఎస్ (శివ మనసులో శృతి) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుధీర్ బాబు (Sudheer Babu). భిన్నమైన కథలను సెలక్ట్‌ చేసుకుంటూ సినిమాలు చేస్తుంటారు ఆయన. సినిమా కథలతోపాటు వాటి టైటిల్స్‌ కూడా ట్రెండీగా ఉండేట్టుగా చూసుకుంటారు సుధీర్ బాబు. ఈ క్రమంలోనే ప్రేమ కథా చిత్రమ్, ఆడు మగాడ్రా బుజ్జి, భలే మంచి రోజు, శమంతకమణి వంటి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

సుధీర్‌‌బాబు నటించిన లేటెస్ట్ సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక సుధీర్‌‌బాబు – మోహనకృష్ణ కాంబినేషన్‌లో నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా ‘సమ్మోహనం’. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

ఈ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. మరి ఈ సినిమా టాక్ ఏంటో చూసేద్దాం రండి.

క‌థ ఏంటంటే:

న‌వీన్  (సుధీర్‌బాబు) సినిమా దర్శకుడు. వరుస విజయాలతో దూసుకెళుతుంటాడు. రాజకుమారి లాంటి అమ్మాయిని తన కథా నేపథ్యంగా తీసుకొని సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా నవీన్‌కు ఒక సినిమా రీల్‌ దొరుకుతుంది. ఆ రీల్‌లో అందమైన అమ్మాయి కనిపిస్తుంది. అందులో ఉన్న అమ్మాయి కంటి డాక్టర్‌‌ అలేఖ్య (కృతి శెట్టి) అని తెలుసుకుంటాడు.

ఓ రోజు అలేఖ్యను కలిసి, తను ప్లాన్ చేసిన సినిమాలో నటించాలని కోరతాడు. అయితే అందుకు అలేఖ్య అంగీకరించదు. తనకు, తన కుటుంబానికి సినిమా అంటేనే నచ్చదని చెప్తుంది. అనంతరం జరిగే కొన్ని పరిణామాలతో సినిమాలో నటించడానికి అంగీకరిస్తుంది అలేఖ్య. నవీన్ అడిగినప్పుడు అసలు సినిమాలే నచ్చవని చెప్పిన అలేఖ్య.. నటించడానికి ఎందుకు అంగీకరించింది? నవీన్‌కి దొరికిన రీల్‌కు, అలేఖ్యకి ఉన్న సంబంధం ఏమిటి? అసలు అలేఖ్యతో నవీన్ సినిమా తీశాడా? లేదా? అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే:

సుధీర్‌బాబు – - ఇంద్రగంటి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన ‘సమ్మోహనం’ సినిమా తరహాలోనే ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ కూడా సినిమా ఇండస్ట్రీతో ముడిపడి ఉన్న కథే. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన ఒక అమ్మాయి, ఆమె క‌ల‌లు, కుటుంబంలోని సంఘ‌ర్షణ‌లు.. అలాగే క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఒక యువ‌కుడి జీవితం గురించి ఈ సినిమా ద్వారా చెప్పేందుకు ప్రయత్నించారు దర్శకుడు.

హీరో సుధీర్‌‌బాబును సక్సెస్‌ఫుల్ కమర్షియల్ డైరెక్టర్‌‌గా ప్రేక్షకులకు పరిచయం చేశారు దర్శకుడు. సినిమా ప్రారంభంలోనే కథ స్పీడ్‌గా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత సినిమా కథలో వేగం తగ్గుతుంది. దాంతో కొంత బోర్‌‌గా అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్లు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ కూడా బాగుంది.

ఇక సెకండాఫ్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు గుండెలకు హత్తుకునేలా ఉంటాయి. ఫ్లాష్‌బ్యాక్, దాని తర్వాత సినిమాలో నటించడానికి హీరోయిన్ అంగీకరించే సీన్లు, సినిమా తీసే క్రమం, హీరో, హీరోయిన్లు ఒకరికొకరు దగ్గరయ్యే సన్నివేశాలు బాగున్నాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ ఆకట్టుకుంటుంది.

ఎవ‌రు ఎలా చేశారంటే:

హీరో, హీరోయిన్లుగా సుధీర్‌బాబు, కృతిశెట్టి నటన ఆకట్టుకునేలా ఉంది. ద‌ర్శకుడి క్యారెక్టర్‌లో సుధీర్‌‌ తన పరిధి మేరకు పాత్రకు న్యాయం చేశారు. భావోద్వేగాలతో నిండిన క్యారెక్టర్‌‌లో మొదటిసారి నటించిన కృతిశెట్టి కూడా ఆమె పాత్రకు న్యాయం చేశారు. ఇక వెన్నెల కిషోర్, రాహుల్‌ రామకృష్ణ, అవసరాల శ్రీనివాస్ తమ పరిధిలో నటించి మెప్పించారు. పాట‌లు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి.

ప్లస్ పాయింట్స్:

సుధీర్‌‌బాబు (Sudheer Babu) , కృతిశెట్టి న‌ట‌న

క‌థ‌లో భావోద్వేగాలు

మైనస్ పాయింట్స్:

నెమ్మదిగా సాగే సన్నివేశాలు, సన్నివేశాలు ఊహకు తగినట్టుగా ఉండడం

ఒక్క మాటలో.. ఈ చిత్రం భావోద్వేగాల సమ్మోహనం

Read More : సుధీర్ బాబు (Sudheer Babu) కొత్త సినిమా టైటిల్ 'హంట్'.. థ్రిల్ల‌ర్‌గా సాగిన‌ టీజ‌ర్‌!

You May Also Like These