F3 ప్ర‌మోష‌న్ల‌తో బిజీగా మారిన మెగా ప్రిన్స్ (Varun Tej) వ‌రుణ్ తేజ్

Published on May 13, 2022 09:15 PM IST

క‌రోనా (Corona Virus) కార‌ణంగా గత కొన్ని నెలలుగా ప్ర‌ముఖ సినిమాల విడుద‌ల‌ వాయిదా పడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్రేక్షకులను ఎంతగానో ఊరించిన కొన్ని సినిమాలు ఇప్పుడు భారీ స్థాయిలో విడుదల కాబోతున్నాయి. ఆర్ఆర్ఆర్, ఆచార్య, సర్కారు వారి పాట వంటి సినిమాల విడుదల అనంతరం ప్రస్తుతం మరొక ముఖ్యమైన సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 

విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varu Tej) హీరోలుగా న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ఎఫ్ 2 సినిమా కు కొనసాగింపుగా వస్తున్న ఎఫ్ 3 (F3) సినిమా రాబోతోంది. ఈ సినిమా ఈ నెల చివరలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మ‌ల్టీస్టార‌ర్ సినిమా కాబ‌ట్టి  ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు సమాచారం. అయితే, హీరో వరుణ్‌ తేజ్ కెరీర్ తొలినాళ్ల‌లో యాక్షన్‌ సినిమాలు చేయడానికి ఇండస్ట్రీకి వచ్చినట్లు సినిమాలు చేసేవాడు. 

కానీ ఆ త‌ర్వాత‌ అతడి కెరీర్‌లో రొమాంటిక్‌ సినిమాలే హిట్స్‌గా నిలిచాయి. ఫిదా, తొలి ప్రేమ వంటి లవ్‌స్టోరీలతో హిట్స్‌ సాధించిన వరుణ్ తాజాగా యాక్షన్ మూవీ గనితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఏప్రిల్‌ 8న విడుదలైన గని బాక్సాఫీస్‌ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయిన సంగ‌తి తెలిసిందే. వీకెండ్స్‌లోనూ ఈ సినిమా అంత‌గా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ క్ర‌మంలో వ‌రుణ్ కెరీర్ లోనే అతిపెద్ద‌ డిజాస్టర్‌గా మిగిలింది. ఈ క్రమంలోనే ఆ మ‌ధ్య‌ గని సినిమాపై వరుణ్‌ తేజ్‌ ఎమోషనల్‌ నోట్ కూడా షేర్‌ చేశాడు.