అమరవీరుల స్మారక సభలో ప్రసంగిస్తున్న రామ్ చరణ్ (Ram Charan)
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా సికింద్రాబాద్ ప్రాంతంలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో నటుడు రామ్ చరణ్ అతిథిగా పాల్గొన్నారు. రక్షణ శాఖ గురించి ఎంత చెప్పినా తక్కువేనని, సైనికుల ధైర్యసాహసాల గురించిన కథలు వింటుంటే రోమాలు నిక్కబొడుస్తాయని రామ్ చరణ్ (Ram Charan) తన ఉపన్యాసంలో తెలిపారు. మనం నడిచే నేల, పీల్చే గాలి.. వీటి మీద వీరజవాన్ల చెరగని సంతకం ఎప్పటికీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
అమరవీరుల త్యాగాలను అందరూ గుర్తుపెట్టుకోవాలని అభిప్రాయపడ్డారు. తాను కూడా ఆర్మీ జవాన్ పాత్రలో నటించానని.. ‘ధృవ’ సినిమాలో అలాంటి పాత్రలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు.
రామ్ చరణ్ (Ram Charan) మాట్లాడుతూ “తమ ప్రాణాలను దేశం కోసం పణంగా పెడుతున్న జవాన్ల త్యాగాన్ని స్మరించుకోవడం అందరి విధి. ” అంటూ యువతో ప్రేరణను నింపే వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రక్షణ శాఖ అధికారులతో సెల్ఫీలు దిగారు.