నాపై ట్రోలింగ్ చేయిస్తున్న ఆ బడా హీరో ఎవరనేది అందరికీ తెలుసు: మంచు విష్ణు (Vishnu Manchu)

తనపై ట్రోలింగ్ చేయిస్తున్న హీరో ఎవరనేది అందరికీ తెలుసునని మంచు విష్ణు (Vishnu Manchu) అన్నారు

ట్రోలింగ్ అంశంపై ప్రముఖ కథానాయకుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Vishnu Manchu) స్పందించారు. చిత్ర పరిశ్రమలోని ఓ బడా హీరో తనను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేయిస్తున్నారని కొన్ని రోజుల కింద విష్ణు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోమారు ఆయన ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. తనపై ట్రోలింగ్ చేయిస్తున్న హీరో ఎవరనేది అందరికీ తెలుసునని విష్ణు అన్నారు. తాను నటించిన కొత్త మూవీ ‘జిన్నా’ (Ginna Movie) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

మనుషులను పెట్టి ట్రోలింగ్ చేయిస్తున్నారు

మీపై ట్రోలింగ్ చేయిస్తున్న హీరో ఎవరన్నది బయటపెట్టే ఉద్దేశం ఉందా అని ఆ ఇంటర్వ్యూలో విష్ణును అడగ్గా.. ఆ హీరో ఎవరనేది ఇండస్ట్రీలో అందరికీ తెలుసునన్నారు. ఆయన ఎవరనేది తన నోటితో చెప్పాలనుకోవడం లేదని పేర్కొన్నారు. ‘మా’ ఎన్నికల సమయం నుంచే తనపై ట్రోలింగ్ మొదలైందని విష్ణు చెప్పుకొచ్చారు. ‘మనుషులను పెట్టి ట్రోలింగ్ చేయిస్తున్నారు. ఒక ప్రముఖ హీరో ఇదంతా చేయిస్తున్నారని తెలిసింది. ఆయన ఎవరో మీడియాకూ తెలుసు. కాబట్టి ఆయన పేరును నేను బయటపెట్టట్లేదు’ అని విష్ణు వ్యాఖ్యానించారు. 

ఇకపోతే, మంచు విష్ణు నటించిన తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా.. అక్టోబర్ 21న దీపావళి కానుకగా విడుదల కానుంది. ఇందులో పాయల్ రాజ్‌పుత్‌ (Payal Rajput)తో పాటు సన్నీ లియోన్ (Sunny Leone) కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల రిలీజైన ట్రైలర్‌తో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అలాగే మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ మూవీపై అంచనాలు మరింతగా పెంచేస్తున్నారు. 

ఆశలన్నీ ‘జిన్నా’ పైనే..

గతేడాది 'మోసగాళ్లు' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన మంచు విష్ణు.. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోవడంతో ఆశలన్నీ ‘జిన్నా’ పైనే పెట్టుకున్నారు. మరి, ‘జిన్నా’ మూవీ విష్ణుకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. ఇక, ‘జిన్నా’ తర్వాత మరో క్రేజీ ప్రాజెక్టును లైన్‌లో పెట్టారు విష్ణు. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లతో తన తర్వాతి సినిమాను చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

Read more: తొంభై శాతం హామీల్ని నెరవేర్చాం.. ఫిల్మ్ ఛాంబర్‌లోనే ‘మా’ భవనం: మంచు విష్ణు (Vishnu Manchu)

You May Also Like These