Vijay Devarakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కోసం లేడీ వీరాభిమాని.. ఏం చేసిందో చూశారా?

ఫ్యాన్స్ తో హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda With his Fan Girls)

Vijay Devarakonda: సినిమా హీరోలు, హీరోయిన్స్ కి చాలా మంది అభిమానులు, వీరాభిమానులు ఉంటారు. వారిని ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తారు, ఆరాధిస్తారు. వారిని చూసినా, కలిసినా ఎక్కడలేని విధంగా ఎమోషనల్‌ అవుతారు. వారి ఆనందానికి అవధులు లేవని ఆనందభాష్పాల ద్వారా తెలియజేస్తారు. కొంతమంది.. వారి పేర్లని టాటూ వేయించుకుని ఆనందపడుతారు ఇంకొందరు. 

ఇక మరికొంతమంది పిచ్చి అభిమానులు అయితే తమ అభిమాన హీరో, హీరోయిన్‌ ఫోటోలని పచ్చబొట్టు వేయించుకుంటారు. ఇటీవల సాయి పల్లవి (Sai Pallavi)పై వీరాభిమానంతో ఓ అభిమాని తన గుండెలపై ఆమె బొమ్మను టాటూగా వేయించుకున్న సంగతి తెలిసిందే. ఇదే కోవలోకి చెందుతుంది ఈ యువతి.. తాజాగా ఓ అమ్మాయి విజయ్ దేవరకొండ మీద తనకున్న ప్రేమను టాటూ రూపంలో చూపించింది. ఆ యువతి తన వీపుపై విజయ్ ఫొటోను టాటూగా వేయించుకుంది. ఆ యువతి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి (Arjun Reddy Movie) సినిమా నుండి మన రౌడీ హీరోకు ఎంతో మంది అమ్మాయిలు ఫిదా అయిపోయారు. ఇద్దరు అమ్మాయిలు విజయ్ దేవరకొండను కలవడానికి వచ్చారు. వారిద్దరిలో ఒక అమ్మాయి మాత్రం ఏకంగా వీపుపై విజయ్ దేవరకొండ ను టాటూలా వేయించుకుంది. 

ఓ అమ్మాయి (చెర్రీ) విజయ్ దేవరకొండ ఫోటోని తన వీపుపై పచ్చబొట్టు వేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చుసిన విజయ్.. చెర్రీని 'లైగర్' (Liger Movie) సినిమా ఆఫీస్‌కి పిలిపించాడు. చెర్రీతో పాటు మరో ఫ్యాన్ సోనాలి కూడా లైగర్ ఆఫీస్‌కి వెళ్లారు. అక్కడ వారిద్దరూ రౌడీ హీరోను కలిశారు. ఇద్దరితో సరదాగా ముచ్చటించిన విజయ్.. వారితో కలిసి ఫొటోలు దిగాడు. ఆపై తాను వేయించుకున్న టాటూను చూపిస్తూ సిగ్గుపడిపోయింది చెర్రీ. అంతటి అభిమానానికి విజయ్ షాక్ అయ్యాడు. 

అదే ఆఫీస్ లో ఉన్న డాషింగ్‌ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మీని (Producer Charmi) వారిద్దరికీ పరిచయం చేశాడు. తన వీపుపై విజయ్‌ దేవరకొండ టాటూతో అభిమానాన్ని చాటుకున్నారు చెర్రీ. ఎందుకు టాటూ వేయించుకున్నావు అని విజయ్ అడగడంతో ఎమోషనల్ అయింది ఈ లేడీ ఫ్యాన్. దీంతో విజయ్ దగ్గరికి తీసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే.. పూరీ జ‌గ‌న్నాథ్ (Puri Jagannath) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ తాజా చిత్రం ‘లైగ‌ర్‌’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉంది. ఇప్ప‌టికే లైగ‌ర్‌ నుంచి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ వినిమా ఆగ‌స్టు 25న విడుద‌ల కానుంది. 

Read More: నా అభిమాన బాక్సర్, లెజెండ్ మైక్ టైసన్‌కు జన్మదిన శుభాకాంక్షలు : విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)

You May Also Like These