Thalapathy Vijay: వైజాగ్‌లో దర్శనమిచ్చిన దళపతి విజయ్.. వంశీ పైడిపల్లి సినిమా 'వారసుడు'(Varisu) షూటింగ్ కోసమేనా?

ఎయిర్‌పోర్టు క్యూలో నిల‌బ‌డ్డ విజయ్ స్టిల్ (Thalapathy Vijay Still Viral) ప్రస్తుతం నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజ‌య్ (Vijay), టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ వంశీపైడిప‌ల్లి (Vamshi Paidipally) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'వార‌సుడు'. తమిళంలో ఈ చిత్రం 'వారిసు' పేరుతో తెరకెక్కుతోంది. విజయ్ కెరీర్‌లో 66వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో క‌న్న‌డ బ్యూటీ నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్నా ఫీమేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. 

తాజాగా 'వారసుడు' నుంచి ఓ అప్ డేట్ వచ్చింది. దళపతి విజయ్ వైజాగ్‌లో కనిపించారని టాక్. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాలోని కొంత భాగాన్ని షూట్ చేశారు. షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన నేపథ్యంలో, విజయ్ చెన్నై వెళ్లడానికి వైజాగ్ విమానాశ్రయానికి వచ్చాడు. విజయ్ విమానాశ్రయంలో చాలా సాదాసీదాగా కనిపించాడు. ఆయనను చూసిన అభిమానులు ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. బ్లూ కలర్ షర్ట్‌లో, నల్లటి మాస్క్‌తో కనిపించాడు విజయ్.

ఎయిర్‌పోర్టు క్యూలో నిల‌బ‌డ్డ విజయ్ స్టిల్ (Vijay Still Viral) ప్రస్తుతం నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం 'వార‌సుడు' కొత్త షెడ్యూల్ నేడు షురూ కానుంద‌ట‌. అయితే.. దీనికి సంబంధించిన పూర్తి స‌మాచారంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా, లేటెస్ట్ అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీ అవుతున్నారు ద‌ళ‌ప‌తి అభిమానులు.

కాగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారసుడు' సినిమా భావోద్వేగాలతో మిళితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందనుంది. ఈ సినిమా చిత్రీకరణ గత కొన్ని నెలలుగా నిరంతరాయంగా సాగుతోంది. ఇక, ఈ చిత్రంలో శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, ఖుష్బూ, జయసుధ, ప్రభు, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు.  

'వారసుడు' సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్.. అలాగే పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. ఈ మూవీకి వంశీ పైడిప‌ల్లితో పాటు హ‌రి, అహిషోర్ సోలోమ‌న్ క‌థ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

Read More: Thalapathy Vijay (దళపతి విజయ్) : టాలీవుడ్‌‌కి 'వారసుడు'గా తమిళ హీరో.. ఫస్ట్ లుక్ క్లాస్, సెకండ్ లుక్ మాస్ !

Credits: Twitter, Instagram
You May Also Like These