కోలీవుడ్ స్టార్ హీరో కార్తి (Karthi) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన నటనతో తమిళంతోపాటు తెలుగులోనూ చాలా మంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. ‘ఊపిరి’ లాంటి స్ట్రెయిట్ తెలుగు చిత్రంలోనూ ఆయన నటించారు. కెరీర్ పరంగా కార్తి జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. ‘విరుమన్’, ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1), ‘సర్దార్’ (Sardar) సినిమాలతో ఈ ఏడాది వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు కార్తి.
ఇక సోషల్ మీడియాలో కార్తి ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. కొత్త సినిమా ముచ్చట్లను, వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో ఆయన పంచుకుంటూ ఉంటారు. అయితే కార్తి ఫేస్బుక్ పేజ్ హ్యాక్ అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. ఫేస్బుక్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందన్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా కార్తి తెలియచేశారు. ‘హలో గాయ్స్.. నా ఫేస్బుక్ పేజ్ హ్యాక్ అయ్యింది. మేం ఫేస్బుక్ టీమ్‌తో కలసి పని చేస్తున్నాం. నా పేజ్‌ను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నాం’ అని కార్తి ట్వీట్ చేశారు.
కాగా, కార్తి కొత్త సినిమా ‘జపాన్’ (Japan)కు సంబంధించిన నేడు ఓ అప్డేట్ రానుంది. ఈ చిత్రంలో కార్తి సరసన అనూ ఇమ్మాన్యుయేల్ యాక్ట్ చేస్తున్నారు. ఇందులో సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే, సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్‌కు గురవ్వడం కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఎవరిదో ఒకరి అకౌంట్స్ హ్యాక్‌కు గురవుతున్నాయి. ఇటీవల కాలంలో చూసుకుంటే.. ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ ఫేస్బుక్ పేజ్ హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే.
Follow Us