Captain Trailer: గ్రహాంతర వాసులతో ఢీ కొడుతున్న హీరో ఆర్య (Hero Aarya).. ఆసక్తికరంగా 'కెప్టెన్' ట్రైలర్..!

'కెప్టెన్' ట్రైలర్ (Captain Traier) లో ఆర్మీ అధికారులు ఓ గ్రహాంతరవాసితో తలపడే యాక్షన్‌ సీన్స్‌ ఉత్కంఠ రేపుతున్నాయి.

తమిళ హీరో ఆర్య (Hero Arya) హీరోగా తాజాగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం 'కెప్టెన్‌' (Captain). థింక్ స్టూడియోస్, ది స్నో పీపుల్ బ్యానర్స్ పై శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో ఆర్య, ఐశ్వర్య లక్ష్మి జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ మూవీ సెప్టెంబర్ 8వ తేదీ రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలో సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు.

డి ఇమాన్ సంగీతం అందించిన.. 'కెప్టెన్' మూవీ తెలుగు వెర్షన్ ను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అండ్ హీరో నితిన్ (Hero Nithiin) తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేయనున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్‌ 8న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులతో పాటు ప్రమోషన్స్‌ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం యూత్ స్టార్ నితిన్ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.

ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

'కెప్టెన్' ట్రైలర్ (Captain Traier) లో ఆర్మీ అధికారులు ఓ గ్రహాంతరవాసితో ధీటుగా తలపడే పోరాట సన్నివేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

ముఖ్యాంగా ఆర్మీ ఆఫీసర్ల అధికారిగా నటి సిమ్రాన్‌ నటించిన తీరు, అలాగే గ్రహాంతవాసులను ఎదుర్కొనేందుకు హీరో ఆర్య వేసే ఎత్తుగడలను వివరిస్తూ సాగిన ఈ ట్రైలర్‌ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. 

హాలీవుడ్ స్థాయి చిత్రం

కంప్లీట్ డిఫరెంట్ స్టోరీతో హాలీవుడ్ స్థాయిలో సినిమా తెరకెక్కించారని ట్రైలర్ (Captain Traier) చూస్తే అర్థం అవుతోంది. ఒక అడవిలో వింత జీవులను ఎదుర్కోవడానికి సెక్టార్ 42 అని పిలువబడే ఒక పాడుబడిన ప్రాంతానికి ఆర్య, అతని నలుగురు సహచరులు వెళ్ళినప్పుడు ఏమైందనేది ఈ సినిమా సబ్జెక్టు. హీరో, అతని బృందం గ్రహాంతరవాసులను ఎలా ఎదుర్కొన్నారు అనేది మిగిలిన కథ. 

Read More: మాస్ లుక్ లో సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth).. 'జైలర్' మూవీ (Jailer First Look) ఫస్ట్ లుక్ రిలీజ్..!

Credits: Youtube
You May Also Like These