విక్రమ్ (Vikram).. సౌత్ ఇండియాలో పేరెన్నిక గల నటుడు. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో ఒకప్పుడు సైడ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పనిచేసిన విక్రమ్.. తన స్వయంశక్తితో స్టార్ హీరో స్థాయిని సంపాదించుకున్నాడు. సేతు, సమురాయ్, మల్లన్న లాంటి సినిమాలు అతని స్టామినాని మనకు తెలియజేస్తాయి.
విక్రమ్ (Vikram) నటించిన అనేక తమిళ సినిమాలు తెలుగులో డబ్ చేయబడి ఇక్కడ కూడా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాయి. అలాంటి సినిమాలలో టాప్ 5 చిత్రాలు మీకోసం ప్రత్యేకం
అపరిచితుడు (Aparichitudu) : శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అవినీతిపై ఎక్కుపెట్టిన మరో బ్రహ్మాస్త్రం. ఈ సినిమాలో నటుడు విక్రమ్ అపరిచితుడి పాత్రతో పాటు, చారి అనే బ్రాహ్మణుడి పాత్రలో, రెమో అనే స్టైలిష్ మోడల్ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీసు హిట్‌గా నిలిచింది.
శివ పుత్రుడు (Siva Putrudu) : దర్శకుడు బాల డైరెక్షన్‌లో తెరకెక్కిన 'శివపుత్రుడు' చిత్రంలో విక్రమ్ ఒక వైవిధ్యమైన పాత్ర పోషించాడు. కాటికాపరి ఇంట్లో పెరిగిన యువకుడు ఏ విధంగా తనకు తెలియని సమాజంలోకి వెళ్లి, ఓ స్నేహితుడిని పొందుతాడన్నదే ఈ సినిమా కథ. తన మిత్రుడిని చంపిన హంతుకులను శివపుత్రుడు హతమార్చడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాలో నటనకు విక్రమ్‌కు జాతీయ స్థాయిలో పేరొచ్చింది.
నాన్న (Nanna) : ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'దైవ తిరుమగల్' అనే తమిళ సినిమా తెలుగులో 'నాన్న' పేరుతో డబ్ చేయబడింది. ఈ సినిమా ప్రధానంగా మానసిక వైకల్యంతో బాధపడే ఓ తండ్రి, తన బిడ్డను ఎలా పోషించుకుంటాడన్న కథాంశంతో సాగుతుంది. ఈ సినిమాలో నటనకు విక్రమ్‌కు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డు దక్కింది.
విలన్ (Villian) : మణిరత్నం తమిళంలో తీసిన 'రావణన్' సినిమా తెలుగులో 'విలన్' పేరిట డబ్ చేయబడింది. ఐశ్వర్యారాయ్ ఇందులో కథానాయిక. రామాయణంలో పాత్రల ప్రేరణతో ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ను తీర్చిదిద్దారు దర్శకుడు. హిందీలో ఇదే చిత్రాన్ని రీమేక్ చేయగా, అభిషేక్ బచ్చన్ కథానాయకుడిగా నటించడం గమనార్హం.
ఐ (I) : శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. ఓ బాడీ బిల్డర్ పై రసాయనిక ప్రయోగం చేసి కురూపిగా మార్చేస్తారు అతని శత్రువులు. తన జీవితాన్ని నాశనం చేసిన వారిపై కథానాయకుడు ఏ విధంగా పగ తీర్చుకుంటాడన్నదే చిత్రకథ. ఈ సినిమాకు గాను విక్రమ్ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకోవడం గమనార్హం.
విక్రమ్ (Vikram) ప్రస్తుతం 'కోబ్రా' (Cobra) చిత్రంలో నటిస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్ రెండు వైవిధ్యమైన పాత్రలను పోషిస్తున్నాడు. ఇది ఆయన నటిస్తున్న 58 వ చిత్రం.
Read More: మణిరత్నం (Mani Ratnam) ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
Follow Us