Sammathame Movie: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న 'సమ్మతమే' మూవీ.. కలెక్షన్లు ఎంతంటే?

సమ్మతమే మూవీ పోస్టర్స్ (Sammathame Movie Posters)

సినిమా ఇండస్ట్రీలో కి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా నిలదొక్కుకున్న నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఆయన  కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సమ్మతమే'. చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ నిర్మించారు. 

ప్రపంచ వ్యాప్తంగా 'సమ్మతమే' మూవీ(Sammathame Movie) జూన్ 24న విడుదలయింది. విడుదలయిన అన్ని థియేటర్లలో ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శతమవుతోంది. దీంతో కిరణ్ అబ్బవరం అభిమానులు, ప్రేక్షకుల మధ్య సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇక, ఈ సినిమా మొదటి రోజు అంతంతమాత్రంగానే కలెక్షన్స్ అందుకుంది. కానీ రెండవ రోజు మాత్రం ఊహించని విధంగా కలెక్షన్స్ పెంచుకోవడం విశేషం. ఇక రెండవ రోజు ఈ సినిమా ఎలాంటి వసూళ్లను అందుకుంది. హిట్ కావాలి అంటే ఇంకా ఎంత రాబట్టాలి అనే వివరాల్లోకి వెళితే...

మొదటి రోజు టాక్ చూసిన తర్వాత బాక్సాఫీస్ (Sammathame Movie Boxoffice Collections) దగ్గర రెండో రోజు డ్రాప్ అవుతుంది అనుకున్న సమ్మతమే సినిమా ఆఫ్ లైన్ లో టికెట్ సేల్స్ జోరుగా నైట్ షోలకు కొనసాగడంతో మొత్తం మీద రెండో రోజును చాలా బాగా ముగించి దుమ్ము లేపింది. అయితే మొదటి రోజు పెద్దగా టాక్ రాకపోవడంతో కలెక్షన్స్ కూడా అనుకున్నంతగా ఏమీ రాలేదు. జస్ట్ ఫర్వాలేదనిపించే విధంగా 56 లక్షల షేర్ మాత్రమే అందుకుంది. అయితే పెట్టిన పెట్టుబడికి ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం అనేది కొంత నిరాశ పరిచే విషయం. కాబట్టి వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ సినిమా వీలైనంత ఎక్కువ కలెక్షన్స్ అందుకుంటేనే లాభాల్లోకి రాగలుగుతుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక రెండవ రోజు సమ్మతమే (Sammathame Collections) ఎవరు ఊహించని విధంగా మంచి కలెక్షన్స్ అందుకోవడం విశేషం. శనివారం మధ్యాహ్నం వరకు అంతంత మాత్రంగానే ఉన్న కలెక్షన్స్ ఒక్కసారిగా ఈవినింగ్ షోలతో ఊపందుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెరగడంతో ఈ సినిమాకు రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 40 లక్షల షేర్ అందుకున్నట్లు తెలుస్తోంది.. మొత్తం మీద ఈ సినిమా ఓవరాల్ గా రెండు రోజు అయితే 50 లక్షల దాకా షేర్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ పూర్తి లెక్కల పై క్లారిటీ రావాలంటే వీకెండ్ ముగిసే వరకు ఆగాల్సిందే. 

ఇప్పుడు 1.10 కోట్ల రేంజ్ లో తెలుగు రాష్ట్రాలలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక 2 రోజుల్లో టోటల్ (Sammathame Worldwide Collections) వరల్డ్ వైడ్ గా 1.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా కొంచం అటూ ఇటూగా సొంతం చేసుకుందని అంచనా వేస్తున్నారు. ఓవరాల్ గా రెండో రోజు సినిమా బాగానే హోల్డ్ చేసింది అని చెప్పాలి. 5 కోట్ల రేంజ్ టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 3.65 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది.

Read More: Sammathame Movie: హిట్ టాక్ సొంతం చేసుకున్న 'సమ్మతమే' మూవీ.. సక్సెస్ సెలబ్రేషన్స్ లో కిరణ్ అబ్బవరం!

You May Also Like These