KGF CHAPTER 2 : అభిమానులతో యశ్ ముచ్చట్లు

Published on Apr 19, 2022 07:09 PM IST

కేజీఎఫ్ 2 స్టార్ యశ్ ఇటీవలే హైదరాబాద్ నగరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తన అభిమానులతో, విలేకరులతో కాసేపు ముచ్చటించారు. పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

మీరు ఎలాంటి దర్శకులతో పనిచేయాలని అనుకుంటున్నారు అని ఓ విలేకరి ప్రశ్నించగా.. తనకు ఇలాంటి అంశాల మీద నమ్మకం లేదని తెలిపారు.

డైరెక్టర్ తాను నమ్మిన కథకు ఏ హీరో అయితే బాగుంటాడన్నది ఆయనే నిర్ణయించుకోవాలని, కథానాయకులు అనేవారు కేవలం నిమిత్తమాత్రులని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రం బాక్సాఫీసు వద్ద రేపుతున్న దుమ్ము మామూలుగా లేదని ఆయన తెలిపారు.