Keerty Suresh: అభిమానుల కేరింతల నడుమ కీర్తి సురేష్

Published on Apr 19, 2022 06:51 PM IST

మహానటి.. ఈ చిత్రం నటి కీర్తి సురేష్‌కు తీసుకొచ్చిన పేరు అంతా ఇంతా కాదు. అంతకు ముందు అనేక సినిమాలలో నటించినా.. మహానటి చిత్రం ఆమె స్థాయిని మరింత పెంచింది. సాక్షాత్తు జాతీయ అవార్డే ఆమెను వరించింది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్‌లో ఆయన చెల్లెలి పాత్రలో కీర్తి నటించనుంది. అలాగే తనకు వీలు చిక్కినప్పుడల్లా పలు పబ్లిక్ ఫంక్షన్లలో పాల్గొంటోంది. ఇటీవలే భాగ్యనగరంలో ఓ షాపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా తన అభిమానులతో కాసేపు ముచ్చటించింది. ఆ వీడియో ప్రత్యేకంగా మీకోసం