ప్రముఖ టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (తారక్) తన తండ్రి సోదరైన ఉమామహేశ్వరి ఇంటిని గురువారం సందర్శించారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసం వద్దకు తన సతీమణితో సహా చేరుకొని, ఆమె కుటుంబీకులను కలిశారు. స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి సోమవారం నాడు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. 52 ఏళ్ల ఉమామహేశ్వరి గత కొంతకాలంగా మానసిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
స్వర్గీయ నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Ramarao) విశ్వ విఖ్యాత నటసార్వభౌములుగా సుపరిచితులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులుగా, ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆయనకు 11 మంది సంతానం. వీరిలో కంఠమనేని ఉమామహేశ్వరి అందరి కంటే చిన్నవారు.
గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి ఈమెకు అక్కలవుతారు. జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ ఎన్టీఆర్ తనయులు. అలాగే ఉమామహేశ్వరికి సోదరులవుతారు.
ఉమామహేశ్వరి (Uma Maheswari) ఆఖరి కోరిక ఆమె కుటుంబీకులు తన నేత్రాలను ఉస్మానియా ఆసుపత్రికి దానం చేశారు. ఆ సమయాన ఆమె భర్త డాక్టర్ శ్రీనివాసరావు భౌతికకాయం వెంటే ఉన్నారు. ఉమా మహేశ్వరి దేహానికి పోస్ట్ మార్టం కూడా ఉస్మానియా ఆసుపత్రిలోనే జరిగింది. ఉమా మహేశ్వరి మరణం వెనుక కారణాలను గురించి విశ్లేషిస్తూ, సోషల్ మీడియాలో పలు చర్చలు జరిగాయి.
కంఠమనేని ఉమామహేశ్వరి(57) అంత్యక్రియలు నిన్న గచ్చిబౌలి ప్రాంతంలోని మహాప్రస్థానంలో బుధవారం ఉదయం 11 గంటలకు జరిగాయి. ఆమె చితికి భర్త శ్రీనివాస్ నిప్పంటించారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు, నారా లోకేష్ మొదలైనవారు హాజరయ్యారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా ఉమమహేశ్వరి కుటుంబీకులకు తన సంతాపాన్ని తెలిపారు. ఇదే క్రమంలో, ఈ రోజు సతీసమేతంగా జూనియర్ ఎన్టీఆర్, ఉమా మహేశ్వరి ఇంటిని సందర్శించారు.
Read More: ఆహ్లాదకరమైన వాతావరణంలో భార్య లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi) తో ఎన్టీఆర్.. ఫొటో వైరల్!
Follow Us