మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా రెడీగా ఉంది. విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ప్రస్తుతం మెగా154 సినిమా షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు చిరు. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా తర్వాత భోళాశంకర్ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. అనంతరం వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేయాలని అనుకున్నారు చిరంజీవి. అయితే ఆ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది.
మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన సినిమా లూసిఫర్. ఈ సినిమాకు రీమేక్‌గానే గాడ్‌ఫాదర్ సినిమా తెరకెక్కింది. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, మురళీశర్మ, సునీల్, బ్రహ్మాజీ, పూరీ జగన్నాథ్ కీలకపాత్రల్లో నటించారు. భోళాశంకర్ సినిమా కూడా కోలీవుడ్ సినిమాకు రీమేక్‌గానే తెరకెక్కుతోంది.
ఫ్లాప్ సినిమా తీసినా.. నమ్మకంతో..
ఇక ఈ సినిమాల తర్వాత చిరంజీవి (Chiranjeevi) మరో రీమేక్ సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన స్పానిష్ సినిమాను రీమేక్ చేయాలని భావిస్తున్నారనట చిరు. ఇటీవలే ఆ సినిమాను చూసిన మెగాస్టార్.. తన ఇమేజ్‌కు ఈ కథ బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారని సమాచారం. మాజీ డాన్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథాంశంతో థ్రిల్లింగ్‌గా సినిమా ఉంటుందని టాక్. ఈ రీమేక్ సినిమాను తెరకెక్కించే బాధ్యతను ప్రభుదేవాకు అప్పగించాలని కూడా నిర్ణయించారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అయిన ప్రభుదేవా అయితే ఈ కథకు న్యాయం చేస్తారని అనుకుంటున్నారని సమాచారం. అయితే ప్రభుదేవా దర్శకత్వంలో చిరంజీవి ఇప్పటికే ‘శంకర్‌దాదా జిందాబాద్’ సినిమా చేశారు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అయినప్పటికీ ప్రభుదేవా మీద ఉన్న నమ్మకంతో డైరెక్షన్ బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. ఈసారైనా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో ప్రభుదేవా సూపర్‌హిట్ కొడతారా లేదా చూడాలి మరి. ఈ సినిమాకు కథ రెడీ చేయడానికి ప్రభుదేవా పని కూడా మొదలుపెట్టారని టాక్.
Read More : ప్రతి అభిమానీ గాడ్‌ఫాదరే.. నా వెనుక లక్షల మంది గాడ్‌ఫాదర్స్ ఉన్నారు: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)
Follow Us