Vikram : సౌత్ ఇండియా లెజండరీ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన 'విక్రమ్' మరో రికార్డును కొల్లగొట్టింది. కోలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ వసూళ్లు రాబట్టిన సినిమాగా చరిత్ర సృష్టించింది. తమిళ సినిమా పరిశ్రమ మొదలై వందేళ్ల గడుస్తుంది. ఇన్నేళ్లలో వచ్చిన సినిమాల్లో విక్రమ్ ఎన్నో రికార్డులను కొల్లగొట్టి అగ్ర స్థానంలో నిలిచింది. 'విక్రమ్' అత్యధిక వసూళ్లను రాబట్టిన కోలీవుడ్ చిత్రంగా నిలిచింది. కమల్ హాసన్ నట విశ్వ రూపం వల్లే ఇదంతా సాధ్యమైందని అభిమానులు అంటున్నారు. 'విక్రమ్' సరికొత్త రికార్డుతో సంబురాలు చేసుకుంటున్నారు.
మొదటి స్థానంలో నిలిచిన విక్రమ్
హీరో కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం విక్రమ్. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పాజిటీవ్ టాక్‌తో దూసుకెళ్లింది. పక్కా యాక్షన్ సినిమాగా ప్రేక్షకులు విక్రమ్ చిత్రాన్ని ఆదరించారు. ఈ సినిమా రూ.450 కోట్లకు పైగా వసూళ్లు చేసి కోలీవుడ్‌లోనే అత్యంత ఎక్కువ షేర్ సాధించిన సినిమాగా నిలిచింది. అంతేకాకుండా తమిళ్‌లో కూడా ‘బాహుబలి-2’ రికార్డును బ్రేక్ చేసి.. మొదటి స్థానంలో నిలిచింది.
కమల్ నటనే హైలెట్
దాదాపు నాలుగేళ్ల తరువాత కమల్ హాసన్ (Kamal Haasan) 'విక్రమ్' సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో తమిళ నటుడు సూర్య, విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ నటుడు ఫాహాద్ ఫాజిల్ ప్రత్యేక పాత్రలలో కనిపించారు. కమల్ అభిమానిగా లోకేష్ కనగరాజన్ మాస్ యాక్షన్ ఫిలిమ్‌ను ప్రేక్షకులకు అందించారు. డ్రగ్స్‌పై పోరాటం చేసే పాత్రలో కమల్ మంచి మెసేజ్ కూడా అందించడం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
కమల్ హాసన్ నటనకు ఇండియన్ హీరోలతో పాటు ప్రపంచ స్థాయి సినీ ప్రముఖులు అభినందించారు. ఈ సినిమా కోయంబత్తూర్‌లోని కేజీ సినిమాస్ థియేటర్‌లో 113రోజులు ప్రదర్శించారు. అత్యధిక మంది వీక్షించిన తమిళ సినిమాగా 'విక్రమ్' మూవీ రికార్డు క్రియేట్ చేసింది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు.
Read More: ‘ఇండియన్ 2’ షూటింగ్ ప్రారంభం.. రెండేళ్ల తరువాత నటిస్తున్న కమల్ (Kamal Haasan)?
Follow Us