తమిళ సినీ పరిశ్రమ అంటేనే సంచలనాలకు మారుపేరు. కానీ 2019 తర్వాత ఒక్క సినిమా కూడా భారీ హిట్ సాధించలేదు. ప్రస్తుతం కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన విక్రమ్ (Vikram) సినిమా హిట్‌తో తమిళ్ ఇండస్ట్రీలో సందడి నెలకొంది. మూడేళ్లుగా ఫ్లాపులతో నిరాశతో ఉన్న కోలీవుడ్.. విక్రమ్ సినిమాతో ఫుల్ జోష్‌లో ఉంది.
విక్రమ్ కలెక్షన్ల మోత
విశ్వనటుడు కమల్ హాసన్ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత నటించిన యాక్షన్ మూవీ విక్రమ్ (Vikram). లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. విక్రమ్ సినిమా కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లో వంద కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే నార్త్‌లో విక్రమ్ సినిమా అనుకున్నంత బిజినెస్ చేయలేదు. హిందీ వెర్షన్ నిదానంగా పికప్ అవుతోందని టాక్.
మూడేళ్ల తర్వాత తమిళ ఇండస్ట్రీకి హిట్
తమిళ చిత్ర పరిశ్రమలో ఈ మధ్య సక్సెస్ సాధించిన సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. అందులోనూ కలెక్షన్ల పరంగా చూస్తే మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. 2019లో అజిత్ నటించిన విశ్వాసం భారీ కలెక్షన్లు రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంత పెద్ద మొత్తంలో కలెక్షన్లు వసూళ్లు చేయలేకపోయాయి. ఇలాంటి సమయంలో, దాదాపు మూడేళ్ల తర్వాత విక్రమ్ (Vikram) బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కమల్ హాసన్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది
లోకేష్ కనగరాజ్ క్రియేటివిటీకి ప్రేక్షకులు ఫిదా
విక్రమ్ (Vikram) నిర్మాతలకు భారీగా లాభాలు తెచ్చిపెడుతుంది. వసూళ్ల పరంగా భారీ బిజినెస్ చేయడంతో కమల్ తెగ సంతోష పడుతున్నారు. విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు ఖరీదైన లగ్జరీ కారును కానుకగా ఇచ్చారు కమల్. అలాగే, రోలేక్స్ సర్ పాత్రలో నటించిన సూర్యకు రోలెక్స్ బ్రాంబ్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా కొత్త మోడల్ బైక్‌లు కానుకగా ఇచ్చారు. తన సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలంటూ కమల్ హాసన్ పలు భాషల్లో వీడియాలు రిలీజ్ చేశారు.
Follow Us