మల్టీప్లెక్స్‌లో సినిమా చేడాలనుకునే మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 16న 'జాతీయ సినిమా దినోత్సవం' (National Cinema Day) సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) ఓ సదవకాశం కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌లలో ప్రేక్షకులు రూ.75లకే సినిమా చూసేందుకు వీలును కల్పిస్తోంది MIA. ఈ మేరకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది.
వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఏ సినిమా అయినా సరే కేవలం రూ.75లకు చూసేయొచ్చు. సింగల్ స్క్రీన్లను (Multiplex, Single Screens) సైతం ఇందులో భాగం చేసే అవకాశం ఉంది. తమను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతగా ఈ వెసులుబాటును తీసుకొస్తున్నట్టు అసోసియేషన్ పేర్కొంది. మరికొన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
రోజురోజుకూ పెరిగిపోతున్న సౌకర్యాలకు అనుగుణంగా సినిమా టికెట్ ధర కేవలం రూ.75 రూపాయలు కాబోతోందంటే నమ్మశక్యం కావడం లేదు కదూ. కానీ ఇది నిజం. కాకపోతే చిన్న ట్విస్టు ఏంటంటే ఈ ఆఫర్ ఒక్క రోజుకే పరిమితం చేయబోతున్నారు. ఇది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఒకవేళ బుక్ మై షో (Book My Show) లాంటి యాప్స్ ద్వారా బుకింగ్ చేసుకోవాలంటే ఆన్ లైన్ చార్జీలు భరించాలి.
దేశంలోని అన్ని నగరాలలో ఉన్న పీవీఆర్ (PVR Cinemas), ఐనాక్స్, ఏషియన్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ డిస్కౌంట్ రేటును అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) థియేటర్ వ్యాపారాన్ని నిలబెట్టిన సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతగా ఈ ఆఫర్ ప్రకటించింది. ఒక రోజు మాత్రమే తగ్గింపుతో.. 4000 కంటే ఎక్కువ మంది సినీ ప్రేక్షకులు వచ్చే థియేటర్లలో ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని తెలిపింది.
అయితే, కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో (Lockdown Effect) జనాలు చాలా వరకు థియేటర్స్ వైపు రావట్లేదనే విమర్శ ఉంది. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా ఇంకా థియేటర్లకు తిరిగి రాని సినీ ప్రేమికులకు ఇది ఆహ్వానం లాంటిది అని చెప్పుకోవచ్చు.
Follow Us