టాలీవుడ్ (Tollywood) హీరోలలో కొందరు విలాసవంతమైన జీవితాలను గడుపుతూ ఉంటారు. హీరోలలో కొందరు తమ సినిమాలు వరుసగా సక్సెస్ అయితే వారి రెమ్యునరేషన్ కూడా పెంచేస్తారు. ఇక భారీ రెమ్యునరేషన్ వస్తే వారి జీవితంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. పెద్ద పెద్ద బంగ్లాలు, లగ్జరీ కార్లు, బ్రాండెడ్ దుస్తులు, వాచ్‌లు ఇలా ఆ హీరోల లైఫ్ స్టైలే మారిపోతుంది. అంతేకాదు కొందరు హీరోలైతే ఏకంగా సొంత విమానాలు కూడా కొనేస్తున్నారు. మన తెలుగు సినిమా హీరోలకు కూడా సొంత జెట్ విమానాలు ఉన్నాయి. సొంత జెట్ విమానాలు కలిగిన ఆ హీరోల వివరాలు పింక్ విల్లా ఫాలోవర్స్ కోసం.
1.అల్లు అర్జున్
టాలీవుడ్ (Tollywood) అగ్ర కథానాయకుల్లో అల్లు అర్జున్ (Allu Arjun) కూడా ఒకరు. అల్లు అర్జున్ నటనతోనే కాకుండా హార్డ్ వర్క్ తో తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో తగ్గేదేలే అంటూ రూ. 350 కోట్లను కొల్లగొట్టారు. బన్ని దాదాపు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారని ప్రచారం జరగుతోంది.
అల్లు అర్జున్కు సొంత జెట్ విమానం కూడా ఉంది. తన కుటుంబంతో కలిసి అప్పడప్పుడు సొంత విమానంలో విహరిస్తుంటారు బన్ని. తన మామయ్య నాగబాబు కూతురు నిహారిక పెళ్లికి హైదరాబాద్ నుంచి రాజస్థాన్‌కు అల్లు అర్జున్ తన జెట్ ఫ్లైట్లో కుటుంబంతో కలిసి వెళ్లారు. అల్లు అర్జున్ రూ. 80 కోట్లు పెట్టి జెట్ విమానం కొన్నారని టాక్.
2. రామ్ చరణ్
రామ్ చరణ్ (Ram Charan) ఎయిర్ లైన్స్ సంస్థ ట్రూజెట్ లో కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అంతేకాకుండా ట్రూజెట్ విమాన సంస్థకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ట్రూజెట్ విమాన సంస్థ దాదాపు 8 విమానాలను నడుపుతోంది. అందులో రామ్ చరణ్ ప్రైవేట్ జెట్ విమానం కూడా ఉంది.
రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అప్పుడప్పుడు సరదాగా సొంత విమానంలో విహరిస్తుంటారు. అంతేకాదు కుటుంబ సభ్యులతో కూడా హాలీడే ట్రిప్పులకు తన ఫ్లైట్ లో వెళ్తుంటారు. సినిమా షూటింగ్ కోసం, ప్రమోషన్ల కోసం కూడా చరణ్ సొంత విమానాన్ని ఉపయోగిస్తుంటారు.
3. నాగార్జున
టాలీవుడ్ మన్మథుడు నాగార్జునకు కూడా సొంత జెట్ విమానం ఉంది. నాగ్ సినిమా షూటింగ్ కోసం కూడా ఎక్కువగా సొంత విమానాన్ని వాడుతుంటారు. ఇటు సినిమా షూటింగ్లు.. అటు బిగ్ బాస్ షూటింగ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నాగ్ ఓన్ ఫ్లైట్లో చక్కర్లు కొడుతుంటారు. సినిమా ఈవెంట్లకు వెళ్లాలన్నా… కుటుంబంతో కలిసి సరదాగా హాలీడే ట్రిప్ కోసం నాగ్ సొంత విమానాన్ని ఉపయోగిస్తుంటారు.
4. ప్రభాస్
రాజు గారు లగ్జరీల విషయంలో అస్సలు తగ్గే సమస్యే ఉండదట. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అంతేకాదు ప్రభాస్ స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ పాన్ ఇండియా హీరోకు విలువైన ఆస్తులతో పాటు సొంత విమానం కూడా ఉంది. సినిమా షూటింగ్స్, ప్రమోషన్లకు ప్రభాస్ తన సొంత జెట్ విమానంలోనే వెళతారట.
5. మహేష్ బాబు
టాలీవుడ్ (Tollywood) రాజకుమారుడు మహేష్ బాబు అని అందరికీ తెలిసిన విషయమే. మహేష్ బాబు సినిమాల్లోనే కాదు బయట కూడా రాజకుమారుడిలానే ఉంటారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచి నటనను వారసత్వంగా తీసుకుని.. తండ్రికి తగిన తనయుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
తెలుగు సినిమా రంగంలో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఈ హ్యాండ్సమ్ హీరోకు వందల కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులతో పాటు సొంత విమానం కూడా ఉంది.
6. జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ (NTR) కూడా ఇటీవలే సొంతంగా ప్రైవేటు విమానాన్ని కొన్నారట. దాదాపు రూ. 80 కోట్లకు పైగా ఖర్చు చేసి సొంత విమానం కొన్నారని సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగింది. ఎన్టీఆర్ తన సొంత విమానంలో షూటింగ్స్, హాలీడే ట్రిప్స్ కోసం ఉపయోగిస్తున్నారు.
Read More: Avatar : The Way of Water : "అవతార్ 2" సినిమా టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలు
Follow Us