టాలీవుడ్ (Tollywood) నటీనటులు ఫాదర్స్ డే ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తండ్రిపై తమకు ఉన్న మమకారాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. నాన్న అనే అనుబంధం ఎంత గొప్పదో చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మహేష్‌బాబు, నితిన్, రష్మిక మందనా, పూజా హెగ్డేలతో పాటు పలువురు సినీ ప్రముఖులు నాన్నకు ప్రేమతో అంటూ తమ ఫాదర్స్‌ను విష్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఫాదర్స్ డే రోజు తన తండ్రి ఫోటోను షేర్ చేశారు. తన తండ్రి లేకుండా తాను లేనంటూ ఎమోషనల్ అయ్యారు. ఓ గొప్ప తండ్రికి కొడుకైనందుకు గర్వపడుతున్నానంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
నన్ను ముందుకు నడిపింది నాన్నే - మహేష్
సూపర్‌స్టార్ మహేష్ బాబు (Maheshbabu) కూడా తన తండ్రి కృష్ణ ఫోటోను షేర్ చేశారు. హ్యాపీ ఫాదర్స్ డే అంటూ పోస్ట్ పెట్టారు. తన నాన్నను చూసి మహేష్ ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. తండ్రి తనకు ఓ మార్గదర్శకుడన్నారు. తాను ఇంత గొప్పగా ఉండటానికి కారణం తన తండ్రే కారణం అంటూ పోస్ట్ చేశారు.
హీరోయిన్లు రష్మిక మందన, పూజ హెగ్డేలు కూడా తమ తండ్రి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమను ఎంతో ప్రేమించే నాన్నకు పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వారితో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
నా సపోర్ట్ మా నాన్నే - నితిన్
హీరో నితిన్ తన తండ్రికి ఫాదర్స్ డే సందర్భంగా విషెస్ తెలిపారు. తన తండ్రితో దిగిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. మంచి ఏదో... చెడు ఏదో.. తనకు ఎప్పుడూ చెబుతూ ఉంటారన్నారు. తన వెనుక ఉండిప్రోత్సాహాన్ని అందిస్తారని తెలిపారు. తన జీవితంలో ఇలాంటి వ్యక్తి ఇంకెవరూ లేరన్నారు. ఐ లవ్ యూ నాన్న అంటూ పోస్ట్ పెట్టారు నితిన్.
Follow Us