Mirzapur Season 3: ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది!.. అప్‌డేట్ ఇచ్చిన అలీ ఫజల్ (Ali Fazal)

‘మీర్జాపూర్’ (Mirzapur 3) మూడో సీజన్ షూటింగ్ పూర్తయ్యిందని అలీ ఫజల్ చెప్పారు. షూట్ ముగింపు సందర్భంగా తీసిన ఓ వీడియోను నెట్టింట షేర్ చేశారు

ఇది వెబ్ సిరీస్‌ల జమానా. ఫలానా ఓటీటీలో ఓ సిరీస్ బాగుందంటే చాలు.. వెతుక్కుని మరీ చూసేస్తున్నారు ఆడియెన్స్. కరోనా లాక్‌డౌన్‌లో ఇంటర్నేషనల్ బెస్ట్ మూవీస్‌తోపాటు వెబ్ సిరీస్‌లను చూసిన మన ప్రేక్షకులు.. ఇండియన్ సిరీస్‌లనూ ఆదరించారు. వాటిల్లో ఒక సిరీసే ‘మీర్జాపూర్’. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయిన ‘మీర్జాపూర్’.. మన దేశంలో అతిపెద్ద విజయం సాధించిన వెబ్ సిరీస్‌గా పలు రికార్డులు సృష్టించింది. 

తొలుత హిందీలో విడుదలైన ‘మీర్జాపూర్’.. ఆ తర్వాత ప్రాంతీయ భాషల్లోనూ ప్రసారమైంది. హిందీతోపాటు మిగిలిన భాషల్లోనూ ఈ సిరీస్‌కు అద్భుతమైన ఆదరణ దక్కింది. తెలుగులోనూ దీనికి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే రెండు సీజన్లు ప్రేక్షకులను ఆదరించాయి. ఈ సిరీస్‌లో మున్నా త్రిపాఠీగా దివ్యేంద్రు, గుడ్డూ పండిట్‌గా అలీ ఫజల్, అఖండానంద్ త్రిపాఠీగా పంకజ్ త్రిపాఠి అద్భుతమైన నటనను కనబర్చారు. తన అన్న, చెల్లిని చంపిన మున్నా త్రిపాఠీని గుడ్డూ పండిట్ చంపడంతో రెండో సీజన్ పూర్తవ్వగా.. మూడో సీజన్ కోసం ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

‘మీర్జాపూర్’ (Mirzapur 3) సిరీస్ ఫ్యాన్స్‌కు అలీ ఫజల్ (Ali Fazal) శుభవార్త చెప్పారు. ఈ సిరీస్ మూడో సీజన్ షూటింగ్ పూర్తయిందని ఆయన వెల్లడించారు. వెబ్ సిరీస్ టీమ్‌తో దిగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా మొత్తం టీమ్ కలసి అరుస్తూ సెలబ్రేట్ చేస్తుండటాన్ని వీడియోలో చూడొచ్చు. 2023లో ఈ సిరీస్‌ను విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మరి, గుడ్డూ పండిట్‌గా అలీ ఫజల్ మరోమారు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటారేమో చూడాలి. 

Read more: Hit 2: థియేటర్ రెస్పాన్స్ మర్చిపోలేను.. మహేష్ బాబు అలా అనడంతో కన్నీళ్లు ఆగలేదు..!: అడివి శేష్ (Adivi Sesh)

You May Also Like These