EXCLUSIVE: "ఆర్య" నుంచి "పుష్ప" వరకూ .. విభిన్న పాత్రలకు ప్రాణం పోస్తూ "అల్లు అర్జున్" (Allu Arjun) పొందిన అవార్డులెన్నో !

టాలీవుడ్‌తో పాటు దక్షిణాది పరిశ్రమ అందించే ఎన్నో అవార్డులను, రివార్డులను "అల్లు అర్జున్" (Allu Arjun) కైవసం చేసుకున్నారు.

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) "పుష్ప" సినిమా తరువాత పాన్ ఇండియా లెవల్‌లో పాపులర్ అయ్యారు. ఇటీవలే అల్లు అర్జున్ ఓ అరుదైన గౌరవం కూడా అందుకున్నారు. "సిఎన్ఎన్ నెట్ వర్క్ 18" అందించే "ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2021" అవార్డును అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు.  

టాలీవుడ్‌తో పాటు దక్షిణాది పరిశ్రమ అందించే ఎన్నో అవార్డులను, రివార్డులను బన్నీ కైవసం చేసుకున్నారు. అల్లు అర్జున్ ఇప్పటివరకు అందుకున్న అత్యుత్తమ పురస్కారాలపై పింక్ విల్లా ప్రత్యేక కథనం.

చరిత్రను తిరగరాసిన "పుష్ప" 
దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన "పుష్ప" సినిమా అల్లు అర్జున్‌ (Allu Arjun)కు డబుల్ బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చింది. రష్మిక మందన్నతో కలిసి అల్లు అర్జున్ "పుష్ప"లో తన నట విశ్వ రూపం చూపించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో "పుష్ప" హిట్ చిత్రంగా నిలిచింది. 

గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేసే మాఫియాలో ఒక సాధారణ వ్యక్తిగా ఎంటరై.. అనతికాలంలోనే డాన్ స్థాయికి ఎదిగిన పుష్పరాజ్ అనే యువకుడి కథ ఇది. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించారని చెప్పవచ్చు. 

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 365 కోట్ల రూపాయలను ఈ చిత్రం వసూలు చేసింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారారు బన్ని. "పుష్ప" సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతేకాదు పలు సంస్థలు అల్లు అర్జున్‌‌ను ప్రత్యేక అవార్డులతో సత్కరించాయి కూడా.

2022 సంవత్సరంలో అల్లు అర్జున్ మూడు అవార్డులను అందుకున్నారు. సిఎన్ఎన్ నెట్ వర్క్ 18 అందించే "ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2021" అవార్డును కైవసం చేసుకున్నారు. 67 వ ఫిలిమ్ ఫేర్ అవార్డు వేడుకల్లో కూడా అల్లు అర్జున్ అదరగొట్టారు. "పుష్ప" సినిమాకుగాను ఉత్తమ కథానాయకుడిగా అల్లు అర్జున్ ఈ అవార్డు అందుకున్నారు. 

తొలిచిత్రంతోనే సత్తా చాటిన బన్నీ
మొదటి సినిమా "గంగోత్రి" చిత్రంలో నటనకు బన్నీ "సినీ మా" అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో గ్రామీణ యువకుడి పాత్రకు బన్నీ పూర్తి న్యాయం చేశారు. ఆ తర్వాత ఆర్య, దేశముదురు, పరుగు, రేసు గుర్రం సినిమాలకు గానూ బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ పలుమార్లు "సినీమా" అవార్డులు అందుకున్నారు. 

ఫిల్మ్‌ఫేర్ అవార్డులెన్నో...
పరుగు, వేదం, రేసు గుర్రం సినిమాల్లో నటించిన అల్లు అర్జున్ .. ఈ మూడు సినిమాలకు కూడా "బెస్ట్ యాక్టర్ కేటగిరీ"లో పురస్కారం అందుకున్నారు. ముఖ్యంగా "వేదం" చిత్రంలో అల్లు అర్జున్ పోషించిన కేబుల్ రాజు పాత్ర ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే "సరైనోడు" చిత్రానికి కూడా ఉత్తమ నటుడిగా క్రిటిక్ అవార్డును అందుకున్నారు. అలాగే "పుష్ప ది రైజ్" సినిమాలో నటనకు కూడా బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. 

ఐఫా ఉత్సవంలో..
"రుద్రమదేవి" చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రలో నటించిన అల్లు అర్జున్ నటనకు "ఐఫా ఉత్సవం"లో ఉత్తమ సహాయనటుడి కేటగిరిలో అవార్డు లభించడం విశేషం

మిర్చి మ్యూజిక్ అవార్డ్..
"రేసుగుర్రం" చిత్రంలో అల్లు అర్జున్ నటనకు "మిర్చి మ్యూజిక్ అవార్డు" నిర్వాహకులు "యూత్ ఐకాన్ ఆప్ ది ఇయర్" అవార్డును ప్రకటించారు. ఈ సినిమాలో పూర్తి స్థాయి మాస్ పాత్రలో మనకు అల్లు అర్జున్ కనిపిస్తారు.

నంది అవార్డులు
గంగోత్రి, ఆర్య, పరుగు, వేదం సినిమాల్లో నటించిన అల్లు అర్జున్ స్పెషల్ జ్యూరీ కేటగిరిలో నంది అవార్డు అందుకున్నారు. ముఖ్యంగా "ఆర్య" చిత్రంలో ప్రేమకు కొత్త అర్థాన్ని చెప్పే నేటితరం లవర్‌బోయ్‌గా బన్నీ పోషించిన పాత్ర తనకు యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను పెంచింది. అలాగే "రుద్రమదేవి" సినిమాకు గానూ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా అల్లు అర్జున్ (Allu Arjun) నంది అవార్డు సాధించారు. 

సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్
సరైనోడు, అలా వైకుంఠపురంలో సినిమాలకు గానూ "మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు"ను సాక్షి మీడియా అల్లు అర్జున్‌కు ప్రకటించడం విశేషం. 

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డు
రుద్రమదేవి, అలా వైకుంఠపురంలో, పుష్ప ది రైజ్ సినిమాలలో నటనకు గాను అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నారు. 

సౌత్ స్కోప్ లైఫ్ స్టైల్ అవార్డు
పరుగు, ఆర్య 2, వేదం సినిమాలలో నటించిన అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్‌గా సౌత్ స్కోప్ లైఫ్ స్టైల్ అవార్డును తీసుకున్నారు.

టీఎస్ఆర్ టీవీ 9 నేషనల్ అవార్డు
రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి సినిమాలలో నటనకు గాను టీఎస్ఆర్ టీవీ 9 నేషనల్ అవార్డును అల్లు అర్జున్ గెలుచుకున్నారు. ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త టి.సుబ్బరామిరెడ్డి ప్రతీ యేటా ఈ పురస్కారాలను అందిస్తూ ఉంటారు. 

 

జీ సినిమా అవార్టు తెలుగు
"దువ్వాడ జగన్నాథం" సినిమాలో నటించిన అల్లు అర్జున్‌కు ఫేవరెట్ యాక్టర్‌గా జీ సినిమా తెలుగు అవార్డు దక్కింది. అలాగే "దువ్వాడ జగన్నాథం" చిత్రంలో తొలిసారిగా బ్రాహ్మణ యువకుడిగా అల్లు అర్జున్ ఒక డిఫరెంట్ పాత్రను పోషించారు. మాస్ ప్రేక్షకులను కూడా ఈ పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది.

Read More: Pushpa 2: ప్ర‌భాస్ కంటే అల్లు అర్జున్ (Allu Arjun) రెమ్యూన‌రేష‌న్ ఎక్కువ‌ట‌.. త‌గ్గేదేలే అంటున్న పుష్ప‌రాజ్

Credits: Wikipedia
You May Also Like These