‘అవతార్ 2’ (Avatar 2) మూవీ: మరీ అంత రేటా?.. బెంగళూరులో ఒక్కో టికెట్ ధర రూ.1,400.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?

‘అవతార్ 2’ (Avatar 2)ను ఇండియాలో ఇంగ్లీషుతో సహా ఏడు భాషల్లో రిలీజ్ చేస్తుండటం విశేషం

ప్రపంచ సినీ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్ 2’ (Avatar 2). లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ హాలీవుడ్ మూవీని ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ పేరుతో వరల్డ్‌వైడ్‌గా డిసెంబర్ 16న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ రోజు విడుదలైన కొత్త ట్రైలర్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రెట్టింపు చేసింది. 

టీజర్స్, ట్రైలర్స్ చూస్తుంటే ‘అవతార్’ తొలి భాగాన్ని మించి రెండో భాగాన్ని జేమ్స్ కామెరాన్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. విజువల్ వండర్‌గా సెకండ్ పార్ట్‌ను సీక్వెల్‌ను తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా టికెట్ బుకింగ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ‘అవతార్ 2’ను ఇంగ్లీషుతో సహా ఏడు భాషల్లో రిలీజ్ చేస్తుండటం విశేషం. ఈ మధ్య కాలంలో ఒక హాలీవుడ్ మూవీని ఇంత భారీ రేంజ్‌లో విడుదల చేయడం ఇదేనేమో. 

ప్రముఖ టికెట్ బుకింగ్ సైట్స్, యాప్‌లు ప్రధాన నగరాల్లోని థియేటర్స్‌లో బుకింగ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ‘అవతార్ 2’ను ఐమాక్స్ 3డీ, 4డీఎక్స్, 3డీ ఫార్మాట్‌లలోనూ రిలీజ్ చేస్తుండటంతో ఆ స్క్రీన్స్‌లోనే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఫార్మాట్ కలిగిన స్క్రీన్‌ల టికెట్ ధరలు చూస్తే మాత్రం గుండెలు గుభేల్ మనాల్సిందే. బెంగళూరులో ఈ మూవీ ప్రదర్శితం కాబోయే ఐమాక్స్ 3డీ స్క్రీన్‌లో టికెట్ ధర ఏకంగా రూ.1,450గా చూపిస్తోంది. పుణెలో రూ.1,200 (4డీఎక్స్ 3డీ), ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో రూ.1,000గా ఉంది. ఇక హైదరాబాద్‌లో ఒక్కో టికెట్ వెల రూ.350 (4డీఎక్స్ 3డీ ఫార్మాట్), వైజాగ్‌లో రూ.210 (3డీ ఫార్మాట్)గా ఉంది. ఈ ధరలన్నీ సాధారణ సీట్స్‌కు సంబంధించినవి కావడం గమనార్హం. 

Read more: ‘పుష్ప 2’ సినిమాలో మరో హీరోయిన్!.. నెగెటివ్ పాత్రలో కనిపించనున్న కేథరిన్ ట్రెసా?

You May Also Like These